Telugu Global
Cinema & Entertainment

అల్ల‌రి న‌రేష్ వ‌య  ఆంధ్ర . తెలంగాణ‌..! 

సినిమా ప్ర‌చారం  విష‌యంలో ఆడియో రిలీజ్ వేడుక అనేది ఒక పెద్ద  ఘ‌ట్టం.   కాస్టింగ్ కు ఉన్న క్రేజ్ ను బ‌ట్టి..ప్రొడ్యూస‌ర్ జేబులో  ఉన్న  బ‌డ్జెట్ ను ప‌ట్టి ఈ వేడుక   హ‌డావుడి వుంటుంది. ఎలా చూసిన   సినిమా  రిలీజ్ కు ముందు ఇదే   పెద్ద ఈవెంట్ అనడంలో సందేహాం లేదు.  అందుకే ద‌ర్శ‌క నిర్మాత‌ల  ఆడియో రిలీజ్ ను   జాగ్ర‌త్త‌గా  ప్ర‌చారం ప‌రంగా మైలేజ్ వ‌చ్చేలా చూసుకుంటారు.  ఇక […]

అల్ల‌రి న‌రేష్ వ‌య  ఆంధ్ర . తెలంగాణ‌..! 
X
సినిమా ప్ర‌చారం విష‌యంలో ఆడియో రిలీజ్ వేడుక అనేది ఒక పెద్ద ఘ‌ట్టం. కాస్టింగ్ కు ఉన్న క్రేజ్ ను బ‌ట్టి..ప్రొడ్యూస‌ర్ జేబులో ఉన్న బ‌డ్జెట్ ను ప‌ట్టి ఈ వేడుక హ‌డావుడి వుంటుంది. ఎలా చూసిన సినిమా రిలీజ్ కు ముందు ఇదే పెద్ద ఈవెంట్ అనడంలో సందేహాం లేదు. అందుకే ద‌ర్శ‌క నిర్మాత‌ల ఆడియో రిలీజ్ ను జాగ్ర‌త్త‌గా ప్ర‌చారం ప‌రంగా మైలేజ్ వ‌చ్చేలా చూసుకుంటారు. ఇక అస‌లు విష‌యం ఏమిటంటే..ఈ మ‌ధ్య మంచి హిట్ ప‌డ‌క స‌త‌మ‌తం అవుతున్న అల్ల‌రి న‌రేష్ ఈసారి సెల్ఫీ రాజా చిత్రంతో అబిమానుల్ని అల‌రించ‌డానికి సిద్ద‌మ‌య్యాడు.
ఈ చిత్రంలో కొన్ని పాట‌ల్ని విశాఖ‌, విజ‌య‌వాడ లో విడుద‌ల చేసి..ఆ త‌రువాత వ‌రంగ‌ల్ లో రిలీజ్ చేస్తార‌ట‌. ఈశ్వ‌రెడ్డి ద‌ర్శ‌కుడు.సాక్షి చౌద‌రి , కామ్న ర‌ణావ‌త్ హీరోయిన్స్ గా న‌టించారు.సాయి కార్తీక్ సంగీతం అందించారు. ఈనెల‌లో సినిమాను రిలీజ్ చేయ‌డానికి రెడి చేస్తున్నార‌ట‌. మ‌రి మంచి హిట్ కోసం వెయిట్ చేస్తున్న అల్ల‌రి న‌రేష్ కు సెల్ఫీ రాజా అయిన సూప‌ర్ హిట్ కావాల‌ని ఆశిద్దాం.
First Published:  8 July 2016 4:52 AM IST
Next Story