లోకేష్‌ను "బ్యాక్ రూమ్ బాయ్"గా అభివర్ణించిన ఎకనామిక్ టైమ్స్
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల కుమారులను పోలుస్తూ ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ది ఎకనామిక్ టైమ్స్ ఆసక్తికరమైన కథనాన్ని ప్రచురించింది. కొద్ది రోజుల క్రితం ఒక జర్నలిస్టు నేరుగా చంద్రబాబును వచ్చే ఎన్నికల్లో మీ అబ్బాయిని సీఎం అభ్యర్థిగా నిలుపుతారా అని ప్రశ్నించగా చంద్రబాబు ఆగ్రహించారట. ఈ ప్రశ్న పదపదే నన్నే ఎందుకు అడుగుతారు… నాకేమైంది అని అసహనం వ్యక్తం చేశారట. కేటీఆర్ గురించి విశ్లేషిస్తూ సదరు పత్రిక… తనకుమారుడి పనితీరుపై కేసీఆర్ పూర్తి సంతృప్తితో ఉన్నారని అభిప్రాయపడింది. […]
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల కుమారులను పోలుస్తూ ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ది ఎకనామిక్ టైమ్స్ ఆసక్తికరమైన కథనాన్ని ప్రచురించింది. కొద్ది రోజుల క్రితం ఒక జర్నలిస్టు నేరుగా చంద్రబాబును వచ్చే ఎన్నికల్లో మీ అబ్బాయిని సీఎం అభ్యర్థిగా నిలుపుతారా అని ప్రశ్నించగా చంద్రబాబు ఆగ్రహించారట. ఈ ప్రశ్న పదపదే నన్నే ఎందుకు అడుగుతారు… నాకేమైంది అని అసహనం వ్యక్తం చేశారట.
కేటీఆర్ గురించి విశ్లేషిస్తూ సదరు పత్రిక… తనకుమారుడి పనితీరుపై కేసీఆర్ పూర్తి సంతృప్తితో ఉన్నారని అభిప్రాయపడింది. గ్రేటర్ ఎన్నికల్లో పార్టీని కేటీఆర్ గెలిపించిన తీరు చూశాక ఆ నమ్మకం మరింత బలపడిందట. న్యూయార్క్‌లో పనిచేసిన కేటీఆర్ అద్బుతమైన ఇంగ్లీష్, వ్యవహర శైలితో అంతర్జాతీయపెట్టుబడులను ఆకర్షించగలుగుతున్నారు. అయితే తాను ముఖ్యమంత్రి కుమారుడు అయినప్పటికీ కేటీఆర్ ఎక్కడా హద్దులు దాటడం లేదని సీనియర్ అధికారులే చెబుతున్నట్టు కథనం. చివరకు కేసీఆర్ ఆధ్వర్యంలో నాలుగు గదుల మధ్య జరిగే మీటింగ్‌ల్లోనూ కేటీఆర్ హద్దులు దాటడం లేదని ప్రభుత్వ కార్యదర్శి ఒకరు చెప్పినట్టు పత్రిక కథనం. ఇక లోకేష్ గురించి …
ఎకనామిక్ టైమ్స్ కొన్ని ఆసక్తికరమైన విషయాలే చెప్పింది. పేరుకు పార్టీ ప్రధానకార్యదర్శి అయినప్పటికీ … ప్రభుత్వంలో జరిగే అన్ని వ్యవహారాలు లోకేష్ కనుసన్నల్లోనే జరుగుతున్నాయని వెల్లడించింది. లోకేష్‌ను ఒక బ్యాక్ రూమ్ బాయ్‌గా అభివర్ణించింది. మంత్రులకు ర్యాంకులు ఇవ్వడంలోనూ, వారి వద్ద సిబ్బందిని నియమించడంలో, కీలక అధికారుల బదిలీల్లో ఇలా ప్రతి విషయంలో లోకేష్ చక్రం తిప్పుతున్నట్టు వెల్లడించింది. బాలకృష్ణ కూతురిని పెళ్లి చేసుకోవడం ద్వారా నందమూరి కుటుంబం వైపు నుంచి కూడా లోకేష్ ముప్పు లేకుండా చేసుకున్నారని అభిప్రాయం. చంద్రబాబు కూడా లోకేష్‌నే నమ్ముతున్నారని అభిప్రాయపడింది. మొత్తం మీద లోకేష్‌ను బ్యాక్ రూమ్ బాయ్ అనడం ద్వారా ఒక రాజ్యాంగేతరశక్తిగా మారాడని ఎకనామిక్ టైమ్స్ నిర్ధారించింది.
Click on Image to Read: