ఈ నీతులు చంద్ర బాబుకు చెప్పలేకపోయారా?
తెలంగాణలో అసెంబ్లీ స్పీకర్ ఆ పదవికి మచ్చ తెస్తున్నారు.. ఆయన రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. నిబంధనలను పట్టించుకోవడం లేదు. కనీస సమాచారం ఇవ్వకుండా.. ఆదేశాలు వెలువరిస్తున్నారు.. ఇదీ ఇప్పుడు తెలంగాణలో టీడీపీ నేతల ఆరోపణలు. ఈ వ్యాఖ్యలు అన్నది ఎవరో కాదు టీడీపీ సీనియర్ నేత రేవూరి ప్రకాశ్ రెడ్డి . పైగా ఇంతకాలం మౌనంగా ఉన్న ఆయన ఉన్నపళంగా స్పీకర్ మధుసూధనాచారిపై ఆరోపణలు ఎందుకు గుప్పించారు? అని అనుమానిస్తున్నారా? అయితే ఇది పూర్తిగా చదవాల్సిందే! తెలంగాణలో […]
BY sarvi6 July 2016 2:39 AM IST
X
sarvi Updated On: 6 July 2016 7:05 AM IST
తెలంగాణలో అసెంబ్లీ స్పీకర్ ఆ పదవికి మచ్చ తెస్తున్నారు.. ఆయన రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. నిబంధనలను పట్టించుకోవడం లేదు. కనీస సమాచారం ఇవ్వకుండా.. ఆదేశాలు వెలువరిస్తున్నారు.. ఇదీ ఇప్పుడు తెలంగాణలో టీడీపీ నేతల ఆరోపణలు. ఈ వ్యాఖ్యలు అన్నది ఎవరో కాదు టీడీపీ సీనియర్ నేత రేవూరి ప్రకాశ్ రెడ్డి . పైగా ఇంతకాలం మౌనంగా ఉన్న ఆయన ఉన్నపళంగా స్పీకర్ మధుసూధనాచారిపై ఆరోపణలు ఎందుకు గుప్పించారు? అని అనుమానిస్తున్నారా? అయితే ఇది పూర్తిగా చదవాల్సిందే!
తెలంగాణలో టీటీడీపీ కార్యాలయాన్ని మూసివేస్తూ.. టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అసెంబ్లీలో తమకు కేటాయించిన కార్యాలయాన్ని ఎలా రద్దు చేస్తారు? అని ప్రశ్నించారు. స్పీకర్ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తూ ఆ పదవికి మచ్చ తెస్తున్నారని ఆరోపించారు. పార్టీ ఎమ్మెల్యేల లేఖలు పెండింగ్‌లో ఉండగానే.. కార్యాలయాన్ని ఎలా రద్దు చేస్తారు? అని ప్రశ్నించారు. స్పీకర్ స్వతంత్రంగా వ్యవహరించకుండా.. కేవలం కేసీఆర్ కుట్రలు అమలు చేసేందుకే సహకరిస్తున్నారని ఆరోపించారు.
రేవూరి వ్యాఖ్యలపై గులాబీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఈ నీతులు చంద్రబాబుకు చెప్పలేకపోయారా? అని ప్రశ్నిస్తున్నారు. వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్, రోజా సస్పెన్షన్ విషయంలో ఏపీ స్పీకర్ కోడెల వ్యవహరించిన తీరు గుర్తు లేదా? అని నిలదీస్తున్నారు. టీటీడీపీ ఎమ్మెల్యేలంతా తమ పార్టీని కారుపార్టీలో విలీనం చేస్తున్నామంటూ టీటీడీపీ ఎమ్మెల్యేలంతా లేఖ ఇచ్చిన విషయాన్ని మర్చిపోయారా? అని గుర్తు చేశారు. గురివింద నీతులు చెప్పడం చంద్రబాబుకే కాదు, ఆయన అనుచరులకూ అలవాటై పోయిందని ఎద్దేవా చేస్తున్నారు.
Next Story