Telugu Global
NEWS

హీరో అఖిల్‌పై విరుచుకుపడ్డ గరికపాటి

ప్రముఖ ప్రవచనకారుడు గరికపాటి నర్సింహారావు సినిమా వాళ్లపై విరుచుకుపడ్డారు. సినిమావాళ్ల ప్రకటన చూసే జనం సర్వనాశనం అవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్షలు తీసుకుని వినియోగదారులకు శనియోగం కల్పిస్తున్నారని మండిపడ్డారు. అన్నం వండడం రాని నటీమణులు కూడా ఆహారపదార్దాల ప్రకటనల్లో నీతులు చెప్పడం ఏమిటని ప్రశ్నించారు. పరోక్షంగా హీరో అక్కినేని అఖిల్‌ను ప్రస్తావించారు గరికపాటి. ”ఒక్క సినిమాలో నటించాడు కుర్రసన్యాసి. రోజు ఫిల్టర్ వేసుకుని వస్తాడు. ఈ ఫిల్టర్‌ను కొనండి అని చెబుతాడు. వీడాఅండి మనకు చెప్పేది. వాటర్ […]

హీరో అఖిల్‌పై విరుచుకుపడ్డ గరికపాటి
X

ప్రముఖ ప్రవచనకారుడు గరికపాటి నర్సింహారావు సినిమా వాళ్లపై విరుచుకుపడ్డారు. సినిమావాళ్ల ప్రకటన చూసే జనం సర్వనాశనం అవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్షలు తీసుకుని వినియోగదారులకు శనియోగం కల్పిస్తున్నారని మండిపడ్డారు. అన్నం వండడం రాని నటీమణులు కూడా ఆహారపదార్దాల ప్రకటనల్లో నీతులు చెప్పడం ఏమిటని ప్రశ్నించారు. పరోక్షంగా హీరో అక్కినేని అఖిల్‌ను ప్రస్తావించారు గరికపాటి.

”ఒక్క సినిమాలో నటించాడు కుర్రసన్యాసి. రోజు ఫిల్టర్ వేసుకుని వస్తాడు. ఈ ఫిల్టర్‌ను కొనండి అని చెబుతాడు. వీడాఅండి మనకు చెప్పేది. వాటర్ ఫిల్టర్‌లో దోషం ఉంటే వాడు బాధ్యత వహిస్తాడా’?’ అని ప్రశ్నించారు. గరికపాటి చెప్పినట్టు ఒక సినిమాలో హీరోగా నటించి వాటర్ ఫిల్టర్‌ ప్రకటనలో నటించింది అక్కినేని అఖిలే. కాబట్టి అతడిని ఉద్దేశించే గరికపాటి ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని భావిస్తున్నారు. ఇలాంటి తప్పుడు ప్రకటన ఇచ్చే వారి వల్లే సమాజం సర్వనాశనం అయిపోతోందని గరికపాటి ఆవేదక వ్యక్తం చేశారు. చీమలు, దోమలతో కూడా వ్యాపారం చేసి సమాజానికి హానీ చేస్తున్నారని గరికపాటి మండిపడ్డారు. ప్రతి వస్తువు ధర పెరగడానికి కారణం ఈ సినిమావాళ్లేనని విమర్శించారు. ఒక కార్యక్రమంలో ప్రవచనాలు చెబుతున్న సమయంలో గరికపాటి ఈ వ్యాఖ్యలు చేశారు.

Click on Image to Read:

garikapati narasimha rao

devineni-uma

lokesh

paruchuri-brothers-chandrab

venkaiah naidu

pattiseema

Byreddy-Rajashekar-Reddy

niti-aayog-andhra-pradesh

manikyala-rao

sailajanath,-chandrababu-na

ktr-chandrababu-naidu

kothapalli-subbarayudu

sakshi-paper

nimmagadda-prasad

babu

buddha venkanna

swis-chalenge

kamalananda bharati

bhumanagireddy

shiva-swamy

ata-2016-ysrcp-leaders speach

karanam-balaram

First Published:  6 July 2016 12:14 PM IST
Next Story