ఢిల్లీ మీటింగ్‌లో భాష రాక "బెబ్బా... బెబ్బెబ్బా..." అనేశారు...
తెలుగు గ్లోబల్. కామ్: టీడీపీ మంత్రులు, ఎంపీలు ఢిల్లీ పర్యటన అంటే భయపడిపోతున్నారు. ఢిల్లీలో ఉండి ఉన్నతస్థాయి వర్గాలతో సంబంధాలు, స్నేహాలు పెంచుకోవాల్సిన మన నేతలు… అక్కడ అందుకు భిన్నంగా బతుకుతున్నారు. ఢిల్లీలో ఏ పెద్ద ఆఫీసర్ కనిపించినా, కీలక నేతలు ఎదురైనా ఎందుకొచ్చిన బాధ అంటూ పక్కకు తప్పుకుంటున్నారు. ఈ పరిస్థితిపై టీడీపీ సీనియర్ నేత ఒకరు మీడియా దగ్గర ఓపెన్ అయిపోయారు. అదేంటి సర్ అంత పెద్ద అధికారి వస్తే విష్ చేసి పరిచయం […]
తెలుగు గ్లోబల్. కామ్: టీడీపీ మంత్రులు, ఎంపీలు ఢిల్లీ పర్యటన అంటే భయపడిపోతున్నారు. ఢిల్లీలో ఉండి ఉన్నతస్థాయి వర్గాలతో సంబంధాలు, స్నేహాలు పెంచుకోవాల్సిన మన నేతలు… అక్కడ అందుకు భిన్నంగా బతుకుతున్నారు. ఢిల్లీలో ఏ పెద్ద ఆఫీసర్ కనిపించినా, కీలక నేతలు ఎదురైనా ఎందుకొచ్చిన బాధ అంటూ పక్కకు తప్పుకుంటున్నారు. ఈ పరిస్థితిపై టీడీపీ సీనియర్ నేత ఒకరు మీడియా దగ్గర ఓపెన్ అయిపోయారు. అదేంటి సర్ అంత పెద్ద అధికారి వస్తే విష్ చేసి పరిచయం పెంచుకోవాల్సింది పోయి పక్కకు తప్పుకుంటున్నారు అని ప్రశ్నించగా… ”భాష బాబు బాష…లాంగ్వేజ్ ప్రాబ్లమ్” అనేశారట. మీడియా మరింత ఆసక్తిగా ప్రశ్నించగా ఢిల్లీలో టీడీపీ మంత్రులు, ఎంపీల పరిస్థితిని సీనియర్ నేత ఏకరువు పెట్టారు.
ఢిల్లీలో కీలక పదవుల్లో ఉన్న కేంద్రమంత్రులు, అధికారులంతా హిందీవారే. వారి దగ్గరకు వెళ్తే హిందీలో గానీ, లేదంటే ఇంగ్లీష్‌లోగానీ మాట్లాడాల్సి ఉంటుంది. కానీ ఒకరిద్దరు మినహాయిస్తే టీడీపీ ఎంపీలకు, రాష్ట్రానికి చెందిన మంత్రులకు ఈ రెండు భాషలపైనా పట్టులేదు. అందరూ పార్టీని పట్టుకుని పైకి ఎదిగిన వారే. కాబట్టి ఢిల్లీలో అధికారుల దగ్గరకు వెళ్తే తికమకపడుతున్నారు. వీరు పొడిపొడి అక్షరాలతో ఇంగ్గీష్‌లో మాట్లాడేందుకు ప్రయత్నించినా అవతలి అధికారులు హిందీలో స్పందిస్తున్నారట. దీంతో ”సర్ ఏదో మాట్లాడుతున్నారే” వివరించేందుకు ఎవరైనా ఉన్నారా అని అటుఇటు చూడాల్సిన పరిస్థితి వస్తోందట.
ఇటీవల జలవివాదాలపై చర్చించేందుకు రెండు రాష్ట్రాల ఇరిగేషన్ శాఖ మంత్రులను కేంద్రం ఢిల్లీ పిలిచింది. ఆ సమయంలో ఉన్నతాధికారులతో హరీష్ రావు హిందీలో చకచక మాట్లాడేశారు. తెలంగాణ సమస్యల గురించి హిందీలోనే అధికారులకు అర్థమయ్యేలా వివరించారట. దేవినేని ఉమ వంతు వచ్చే సరికి హిందీ రాక, ఇంగ్లీష్‌లో ఎక్కువ సేపు మాట్లాడలేక, వాదించలేక డీలా పడిపోయారు. అసలు దేవినేని ఉమ చెప్పింది అక్కడి అధికారులకు కూడా సరిగా అర్థమయినట్టు అనిపించలేదట. సరే ఉమా ఇబ్బందిని అర్థం చేసుకున్న వారు కూడా సర్దుకుపోయారని చెబుతున్నారు. ఈ విషయాన్ని కూడా ఢిల్లీలో భాష ప్రస్తావన వస్తే చాలు టీడీపీ నేతలు ప్రముఖంగా చెప్పుకుంటున్నారు. అయితే టీడీపీ అనుకూల మీడియా మాత్రం… నేతలకు భాష రాకపోవడానికి, ఏపీకి నిధులకు రాకపోవడానికి మధ్య లింక్ పెట్టేసింది. భాష రాకపోవడంతో సరిగా పరిస్థితిని వివరించలేకపోతున్నారని అందుకే కేంద్రం నుంచి నిధులు రావడం లేదని విశ్లేషించింది.
ఢిల్లీ గల్లీల్లో భాష అంశంపై టీడీపీ నేతలు బోల్తాపడడం ఇదే తొలిసారి కాదు. గోదావరి పుష్కరాల తొక్కిసలాటపై టైమ్స్ నౌ ఛానల్ చర్చ నిర్వహించింది. ఈ చర్చలో తొలుత ఎంపీ సీఎం రమేష్ పాల్గొన్నారు. కానీ అవతలి వైపు ఇంగ్లీష్‌ను అర్థం చేసుకోలేక ఆయన కాసేపటికే చేతులెత్తేశారు. దీంతో ఏపీలో ప్రముఖ విద్యాసంస్థల అధినేతలైన మంత్రులు నారాయణ, పల్లె రఘునాథరెడ్డి లైన్లోకి వచ్చారు. చంద్రబాబుకే చిర్రెత్తుకొచ్చే రేంజ్‌లో పరువు తీసేశారు. కొన్ని ఊతపదాలను పదేపదే ఉచ్చరించడం మినహా కనీస స్థాయిలో కూడా మాట్లాడలేకపోయారు. దీంతో ఇంగ్లీష్న ఛానళ్ల ఇంటర్వ్యూలో భాష రాని వారు పాల్గొనవద్దని సీఎం చంద్రబాబు ఆదేశించారు కూడా. ఇంగ్లీష్ ఛానళ్ల బారి నుంచి తప్పించుకున్నా… పనుల కోసం అధికారుల వద్దకు వెళ్లినప్పుడు మాత్రం మన వాళ్లు బుక్కైపోతున్నారు. కొందరు ఎలాగైనా హిందీ నేర్చుకుని ఢిల్లీని గడగడలాడించాలని అనుకుంటున్నారట. అయితే ఆ ఆవేశం కాసేపే ఉంటోందని కూడా చెప్పుకుంటున్నారు.
Click on Image to Read: