హారతిపై సీఎం వ్యాఖ్యలు అవివేకానికి నిదర్శనం... వాటి జోలికి వెళ్లి బాగుపడిన చరిత్ర లేదు
విజయవాడలో ఆలయాల కూల్చివేతపై రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి మండిపడ్డారు. గుళ్ల జోలికి వెళ్లి బాగుపడిన వాడు చరిత్రలో లేడన్నారు. ఆలయాలు కూల్చిన చంద్రబాబుకు కూడా ఇకపై కష్టాలు తప్పవని హెచ్చరించారు. ప్రాణప్రతిష్ట చేసిన అంజనేయస్వామి, లక్ష్మీ చెన్నకేశవస్వామితో పాటు అనేక ఆలయాలను కూల్చడం దారుణమన్నారు. చంద్రబాబుకు విదేశాల పిచ్చిపట్టిందని అందుకే ఆలయాలను కూల్చివేస్తున్నారని బైరెడ్డి ఫైర్ అయ్యారు. చంద్రబాబు చర్యలతో ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తోందన్నారు. 12ఏళ్లకు ఒకసారి వచ్చే కృష్ణా పుష్కరాలను పవిత్రంగా […]

విజయవాడలో ఆలయాల కూల్చివేతపై రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి మండిపడ్డారు. గుళ్ల జోలికి వెళ్లి బాగుపడిన వాడు చరిత్రలో లేడన్నారు. ఆలయాలు కూల్చిన చంద్రబాబుకు కూడా ఇకపై కష్టాలు తప్పవని హెచ్చరించారు. ప్రాణప్రతిష్ట చేసిన అంజనేయస్వామి, లక్ష్మీ చెన్నకేశవస్వామితో పాటు అనేక ఆలయాలను కూల్చడం దారుణమన్నారు.
చంద్రబాబుకు విదేశాల పిచ్చిపట్టిందని అందుకే ఆలయాలను కూల్చివేస్తున్నారని బైరెడ్డి ఫైర్ అయ్యారు. చంద్రబాబు చర్యలతో ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తోందన్నారు. 12ఏళ్లకు ఒకసారి వచ్చే కృష్ణా పుష్కరాలను పవిత్రంగా నిర్వహించాల్సింది పోయి పట్టిసీమ వద్ద గోదావరి జలాలను కృష్ణా నదిలోకి మళ్లించి అక్కడే పుష్కర హారతులు ఇస్తామని ప్రకటించడం సీఎం ఆవివేకానికి నిదర్శమన్నారు. జరుగుతున్నది కృష్ణా పుష్కరాలా లేక గోదావరి పుష్కరాలా అని ప్రశ్నించారు. కృష్ణా పుష్కరాల కోసం కేటాయించిన నిధులతో టీడీపీ నాయకులు జేబులు నింపుకుంటున్నారని ఆరోపించారు.
Click on Image to Read: