వెంకయ్యకు శాఖల మార్పు
కేబినెట్‌ను విస్తరించిన మోదీ … ఇప్పటికే ఉన్న మంత్రుల శాఖలను మార్చేశారు. పార్లమెంట్‌లో అంతా తానై నడిపేందుకు ప్రయత్నించిన వెంకయ్యనాయుడిని పార్లమెంటరీ వ్యవహారాలశాఖ నుంచి తప్పించారు. వెంకయ్యకు సమాచారశాఖ ఇచ్చారు . అనంతకుమార్‌కు పార్లమెంట్ వ్యవహారాలు అప్పగించారు. పట్టణాభివృద్ధి శాఖకు అదనంగా వెంకయ్య సమాచారశాఖను కూడా చూస్తారు. పదేపదే వివాదాస్పదమవుతున్న స్మృతి ఇరానీని మానవవనరుల శాఖ నుంచి చేనేత, జౌళి శాఖకు పంపించారు. ప్రకాశ్ జవదేకర్‌కు మానవవనరుల శాఖను అప్పగించారు. న్యాయశాఖ మంత్రి సదానంద గౌడను […]
కేబినెట్‌ను విస్తరించిన మోదీ … ఇప్పటికే ఉన్న మంత్రుల శాఖలను మార్చేశారు. పార్లమెంట్‌లో అంతా తానై నడిపేందుకు ప్రయత్నించిన వెంకయ్యనాయుడిని పార్లమెంటరీ వ్యవహారాలశాఖ నుంచి తప్పించారు. వెంకయ్యకు సమాచారశాఖ ఇచ్చారు . అనంతకుమార్‌కు పార్లమెంట్ వ్యవహారాలు అప్పగించారు. పట్టణాభివృద్ధి శాఖకు అదనంగా వెంకయ్య సమాచారశాఖను కూడా చూస్తారు.
పదేపదే వివాదాస్పదమవుతున్న స్మృతి ఇరానీని మానవవనరుల శాఖ నుంచి చేనేత, జౌళి శాఖకు పంపించారు. ప్రకాశ్ జవదేకర్‌కు మానవవనరుల శాఖను అప్పగించారు. న్యాయశాఖ మంత్రి సదానంద గౌడను గణాంకాల శాఖకు పంపారు. ఇకపై న్యాయశాఖను రవిశంకర్ ప్రసాద్ చూసుకుంటారు. కొత్తగా చేరిన ఎంజే అక్బర్‌ని విదేశీ వ్యవహారాల సహాయ మంత్రిగా నియమించారు.
Click on Image to Read: