తెలంగాణలో టీడీపీ ఆఖరి కేకలు... మరో దెబ్బకొట్టిన కేసీఆర్
తెలంగాణలో టీడీపీని పూర్తిగా కనుమరుగు చేసేవరకూ కేసీఆర్ వదిలిపెట్టేలా లేరు. ఇప్పటికే టీటీడీపీకి చెందిన రేవంత్, సండ్ర మినహా మిగిలిన ఎమ్మెల్యేలందరిని టీఆర్‌ఎస్‌లో విలీనం చేసుకున్న కేసీఆర్ ప్రభుత్వం తాజాగా మరో దెబ్బకొట్టింది. అసలు టీడీఎల్పీ కార్యాలయమే లేకుండా చేసేశారు. టీటీడీఎల్పీ కార్యాలయాన్ని ఉమెన్ , మైనార్జీ వెల్ఫేర్ కమిటీలకు కేటాయిస్తూ స్పీకర్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో టీటీడీపీకి కార్యాలయం కూడా లేకుండాపోయింది. ఈ పరిణామంతో టీటీడీపీ నేతలు కంగుతిన్నారు. ఎప్పటిలాగే రేవంత్ ఓ రేంజ్‌లో […]
తెలంగాణలో టీడీపీని పూర్తిగా కనుమరుగు చేసేవరకూ కేసీఆర్ వదిలిపెట్టేలా లేరు. ఇప్పటికే టీటీడీపీకి చెందిన రేవంత్, సండ్ర మినహా మిగిలిన ఎమ్మెల్యేలందరిని టీఆర్‌ఎస్‌లో విలీనం చేసుకున్న కేసీఆర్ ప్రభుత్వం తాజాగా మరో దెబ్బకొట్టింది. అసలు టీడీఎల్పీ కార్యాలయమే లేకుండా చేసేశారు. టీటీడీఎల్పీ కార్యాలయాన్ని ఉమెన్ , మైనార్జీ వెల్ఫేర్ కమిటీలకు కేటాయిస్తూ స్పీకర్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో టీటీడీపీకి కార్యాలయం కూడా లేకుండాపోయింది. ఈ పరిణామంతో టీటీడీపీ నేతలు కంగుతిన్నారు. ఎప్పటిలాగే రేవంత్ ఓ రేంజ్‌లో టీఆర్‌ఎస్‌పై ఫైర్ అయ్యారు. తమకు అండగా ఉండండి అంటూ టీకాంగ్రెస్ నేతలు జానారెడ్డి, ఉత్తమకుమార్ రెడ్డిని కలిసి రేవంత్ విన్నవించుకున్నారు.
అసలు నోటీసులు కూడా ఇవ్వకుండా తమ కార్యాలయాన్ని మరొకరికి ఎలా కేటాయిస్తారని రేవంత్ మండిపడ్డారు. ఇదంతా కేసీఆర్ ఆడుతున్న రాక్షస క్రీడ అని విమర్శించారు. రాజకీయ పార్టీలు ఇలాంటివి చేయడంలో ఆశ్చర్యం లేదని కానీ స్పీకర్ కార్యాలయం కనీసం నోటీసులు అందజేయకుండా తమ కార్యాలయాన్ని మరొకరికి ఎలా కేటాయిస్తుందని ప్రశ్నించారు. స్పీకర్ కార్యాలయం … టీఆర్‌ఎస్ కార్యాలయంలా తయారైందని మండిపడ్డారు. అయితే టీడీపీ నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేలంతా తాము తెలంగాణ టీడీపీని టీఆర్‌ఎస్‌లో విలీనం చేస్తున్నట్టు స్పీకర్‌కు లేఖ ఇచ్చారు. దాన్ని ఆమోదించిన స్పీకర్ … టీటీడీపీని టీఆర్‌ఎస్‌లో విలీనం చేసేశారు. అసలు తెలంగాణ అసెంబ్లీలో టీడీపీనే లేనప్పుడు ఇక కార్యాలయం అవసరమా అని టీఆర్‌ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి తెలంగాణలో టీడీపీ ఆఖరి కేకలు వేస్తున్నట్టుగా ఉంది.
Click on Image to Read: