కేజ్రీవాల్‌ని వదలని బీజేపీ
ఎవరేమనుకన్నా కేజ్రీవాల్‌ని వదిలేటట్లులేదు బీజేపీ. కాంగ్రెస్‌తో వైరమున్నా అది ఉత్తుత్తి వైరమే. బీజేపీ అరెస్టు చేయదలచుకుంటే సోనియాను, రాబర్ట్ వాద్రాను అరెస్టు చేసి జైలులో పెట్టడానికి కొత్తగా పరిశోధనలు ఏమీ అక్కర్లేదు. అనేక కేసుల్లో వాళ్లను జైలుపాలు చేయవచ్చు. కానీ బీజేపీ ఆపని చేయదు. ఉత్తుత్తి బెదిరింపులు చేస్తుంది. జనం దృష్టిలో రెండు పార్టీలు శత్రువులన్న భ్రమ కలిగించడానికి. బీజేపీ ఎప్పటికీ కాంగ్రెస్ జోలికి పోదు. రేపు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా బీజేపీ జోలికి పోదు. వాద్రాపై […]
ఎవరేమనుకన్నా కేజ్రీవాల్‌ని వదిలేటట్లులేదు బీజేపీ. కాంగ్రెస్‌తో వైరమున్నా అది ఉత్తుత్తి వైరమే. బీజేపీ అరెస్టు చేయదలచుకుంటే సోనియాను, రాబర్ట్ వాద్రాను అరెస్టు చేసి జైలులో పెట్టడానికి కొత్తగా పరిశోధనలు ఏమీ అక్కర్లేదు. అనేక కేసుల్లో వాళ్లను జైలుపాలు చేయవచ్చు. కానీ బీజేపీ ఆపని చేయదు. ఉత్తుత్తి బెదిరింపులు చేస్తుంది. జనం దృష్టిలో రెండు పార్టీలు శత్రువులన్న భ్రమ కలిగించడానికి. బీజేపీ ఎప్పటికీ కాంగ్రెస్ జోలికి పోదు. రేపు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా బీజేపీ జోలికి పోదు. వాద్రాపై కేసులు తదితరాలంతా జనం కోసమే.
కానీ కేజ్రీవాల్‌తో బీజేపీ వైరం అలాంటికాదు. ఏ చిన్న ఆధారమూ దొరకలేదుగానీ లేకపోతే కేజ్రీవాల్‌ని ఎప్పుడో జైలుపాలు చేసివుండేది. ఆప్ ప్రభుత్వం మీద బీజేపీ కక్షకట్టినట్లుగా బహుశా స్వాతంత్ర్యం వచ్చినప్పటినుంచి ఏ కేంద్రప్రభుత్వం ఏ రాష్ట్రప్రభుత్వం మీదా ఇలా కక్షకట్టి ఉండదు.
అయినదానికి కానిదానికి ఆప్ మంత్రులను అరెస్టు చేయడం కేంద్రం అధికార దుర్వినియోగానికి పరాకాష్ట. ఒక మంత్రిని డిగ్రీ విషయంలో అరెస్టు చేశారు. అదే స్మృతీఇరానీ, మోడీ తదితరుల డిగ్రీల బాగోతం అందరికి తెలిసిందే. గత వారంలో ఒక ఆప్ మంత్రితో ఢిల్లీ మహిళలు గొడవపడితే ఆప్ మంత్రిని అరెస్టు చేశారు. ఎక్కడ మంత్రులతో ప్రజలు గొడవపడ్డా ప్రజలమీద కేసులు పెడతారు. మొదటిసారి మంత్రిమీద కేసు పెట్టి అరెస్టు చేశారు. బహుశా ఇది బీజేపీకే సాధ్యమైంది.
ఇప్పుడు కేజ్రీవాల్ ముఖ్యకార్యదర్శి రాజేంద్రకుమార్‌ను, మరోనలుగురిని కొండను తొవ్వి ఎలుకను పట్టినట్టుగా సీబీఐ అరెస్టు చేసింది. ఇది మీడియాకు పండగ. కేజ్రీవాల్‌నే అరెస్టు చేసినంత హడావుడి చేశారు. కేజ్రీవాల్ ప్రభుత్వంలో ఏదో అవినీతి జరిగిందన్న భ్రమ కలిపించారు. నిజానికి 2007-2015 మధ్య కాంట్రాక్టుల కేటాయింపులో 3కోట్ల రూపాయలమేర అనుచిత లబ్ది పొందారని వాళ్లమీద ఆరోపణ. అప్పుడు ఆప్ అధికారంలోలేదు. ఇప్పుడు చేస్తున్న అవినీతి ఆరోపణ నిజమో కాదో నిరూపణ కాలేదు. అయినా అరెస్టు చేశారు. గత శుక్రవారం నాడు మోడీకి అత్యంత సన్నిహితుడు అదాని రెండు వందల కోట్ల అనుచిత లబ్దిపొందాడు. గత ఏడాది కొన్ని వేల కోట్ల అనుచిత లబ్దిపొందాడు అంబాని. ఇక చంద్రబాబు, జయలలితల అవినీతి సముద్రంలో ఈ 3కోట్లు ఒక నీటి బిందువు. ఇంత చిన్న కేసులో కేజ్రీవాల్ ఆఫీస్ స్ట్యాఫ్‌ను అరెస్టుచేయడం వింతే..! బహుశా ఇది ఢిల్లీ ఎన్నికల్లో ఓటమిపై ప్రతీకారం లాంటిదే. ఢిల్లీ సీఎం కార్యదర్శులు ముగ్గురిని నిన్న అరెస్టుచేయడం, ఒకరిని అండమాన్‌కు బదిలీచేయడం కక్షతీర్చుకోవడమే.
Click on Image to Read: