"విజయ"ను వాళ్లు ముంచుతారా? మీరు ముంచుతారా?
విజయ డైయిరీ ప్రజలకు సరఫరా చేసే పాలు చాలా నాణ్యమైనవి. ప్రమాణాల ప్రకారం ఆరోగ్యకరమైన పాలను విజయ డైయిరీ సప్లైచేస్తుంది. సాధారణంగా ప్రైవేట్ డైయిరీలు లాభాలమీద పెట్టిన దృష్టి పాలు, పాల ఉత్పత్తుల నాణ్యతా ప్రమాణాలమీద పెట్టవు. అందుకే ఎక్కువ మంది ప్రభుత్వ డైయిరీలనుంచి నమ్మకంగా పాలను కొనుక్కుంటారు. విజయ డైయిరీ ఎండీ ఒక ప్రకటన చేస్తూ “శ్రీ సాంబశివ డైయిరీ ప్రొడక్ట్స్” అనే సంస్థ నాసిరకం పాలను విజయ బ్రాండ్ అనిపించేలా ప్యాకేట్లలో నింపి మార్కెట్‌లో […]
విజయ డైయిరీ ప్రజలకు సరఫరా చేసే పాలు చాలా నాణ్యమైనవి. ప్రమాణాల ప్రకారం ఆరోగ్యకరమైన పాలను విజయ డైయిరీ సప్లైచేస్తుంది. సాధారణంగా ప్రైవేట్ డైయిరీలు లాభాలమీద పెట్టిన దృష్టి పాలు, పాల ఉత్పత్తుల నాణ్యతా ప్రమాణాలమీద పెట్టవు. అందుకే ఎక్కువ మంది ప్రభుత్వ డైయిరీలనుంచి నమ్మకంగా పాలను కొనుక్కుంటారు.
విజయ డైయిరీ ఎండీ ఒక ప్రకటన చేస్తూ “శ్రీ సాంబశివ డైయిరీ ప్రొడక్ట్స్” అనే సంస్థ నాసిరకం పాలను విజయ బ్రాండ్ అనిపించేలా ప్యాకేట్లలో నింపి మార్కెట్‌లో సరఫరాచేస్తుందని, ప్రజలు ఈ పాలు కొనవద్దని విజ్ఞప్తిచేశారు.
ఆ విజ్ఞప్తి చూస్తే ఇలాంటి వ్యక్తిని విజయ డైయిరీకి ఎండీగా ఎలా పెట్టారన్న అనుమానం వస్తుంది. విజయ బ్రాండ్ పేరుతో ఏ సంస్థ ప్రజలను మోసం చేస్తుందో తెలిసికూడా పోలీసులకు ఫిర్యాదు చేసి మోసగాళ్లను అరెస్టు చేయించాల్సిందిపోయి అలాంటి పాలను కొనవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారంటే… ఇలాంటి ఎండీలు వుండబట్టేకదా! ప్రభుత్వ సంస్థలు అలా నాశనం అయిపోయింది.
ఈయనగారి నిర్వాకం వల్ల విజయ బ్రాండ్‌లో కల్తీ వచ్చే అవకాశం వుందని చదివి కొంతమంది ఆ పాలను కొనడం మానేస్తారు. ప్రైవేట్ వాళ్లు సరఫరాచేసే పాలవైపు మళ్లుతారు. బాహుశా ఎండీగారి కోరికకూడా ఇదేనేమో..! విజయ డైయిరీని ప్రైవేట్ వాళ్లకన్నా ముందు దాని అధికారులే ముంచేలాగా వున్నారు చూస్తుంటే.
Click on Image to Read: