జగన్ గురించి నిమ్మగడ్డ ప్రసాద్ అలా చెప్పారా?
ఆటా ఉత్సవాల్లో పాల్గొన్న వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ఏపీ ప్రభుత్వ తీరుపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల్ని భ్రమల్లో పెట్టి చంద్రబాబు మోసం చేస్తున్నారని విమర్శించారు. ఏపీలో మీడియా కూడా ఘోరంగా తయారైందన్నారు. గ్రహాల మధ్య కూడా రహదారులు వేసి అనుసంధానం చేసే సత్తా చంద్రబాబుకు ఉందన్నట్టుగా ఒక వర్గం మీడియా ప్రచారం చేస్తూ ప్రజలను మభ్యపెడుతోందని మండిపడ్డారు. జగన్ క్యారెక్టర్‌ను దెబ్బతీసేందుకు లేనిపోని విషయాలు ప్రచారం చేస్తున్నారని ఆక్షేపించారు. గతంలో జగన్‌ను ఇబ్బంది పెట్టడానికి నిమ్మగడ్డ […]
ఆటా ఉత్సవాల్లో పాల్గొన్న వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ఏపీ ప్రభుత్వ తీరుపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల్ని భ్రమల్లో పెట్టి చంద్రబాబు మోసం చేస్తున్నారని విమర్శించారు. ఏపీలో మీడియా కూడా ఘోరంగా తయారైందన్నారు. గ్రహాల మధ్య కూడా రహదారులు వేసి అనుసంధానం చేసే సత్తా చంద్రబాబుకు ఉందన్నట్టుగా ఒక వర్గం మీడియా ప్రచారం చేస్తూ ప్రజలను మభ్యపెడుతోందని మండిపడ్డారు.
జగన్ క్యారెక్టర్‌ను దెబ్బతీసేందుకు లేనిపోని విషయాలు ప్రచారం చేస్తున్నారని ఆక్షేపించారు. గతంలో జగన్‌ను ఇబ్బంది పెట్టడానికి నిమ్మగడ్డ ప్రసాద్‌ను అరెస్ట్ చేశారని చెప్పారు. జైలు నుంచి విడుదలైన తర్వాత జగన్ వ్యక్తిత్వం గురించి ఒక సీనియర్ పోలీస్ అధికారి వద్ద నిమ్మగడ్డ ప్రసాద్ స్వయంగా ఒక విషయం చెప్పారని శ్రీకాంత్ రెడ్డి వెల్లడించారు. ”కేసులో జగన్‌కు వ్యతిరేకంగా తప్పుడు స్టేట్‌మెంట్ ఇస్తే తనను వదిలేస్తామన్నారు. కానీ నేను ఒప్పుకోలేదు. అందుకే జైల్లో పెట్టారు. అలా చేసి చాలా పెద్ద తప్పు చేశారు. జగన్ కంపెనీలో పెట్టుబడులు అప్పుడే కాదు… నా వద్ద డబ్బులుంటే భవిష్యత్తులో కూడా జగన్ కంపెనీలోనే పెట్టుబడిగా పెడుతా” అని నిమ్మగడ్డ ప్రసాద్ స్వయంగా సీనియర్ పోలీస్ అధికారితో చెప్పారని శ్రీకాంత్ రెడ్డి వెల్లడించారు. జగన్ అసలు క్యారెక్టర్ అది అని అన్నారు.
వైఎస్ సీఎంగా ఉన్న సమయంలో పయ్యావుల కేశవ్, ఎర్రబెల్లి దయాకర్ రావు లాంటి వారు ఆయన చాంబర్ చుట్టూ పనుల కోసం తిరిగేవారని ఎమ్మెల్యే శ్రీనివాస్ అన్నారు. పార్టీలకతీతంగా ప్రజలకు మంచి చేసిన వ్యక్తి వైఎస్ అని ఆయన అన్నారు.
Click on Image to Read: