కేసీఆర్ పై పరువు నష్టం దావా: నాగం
కొంతకాలంగా కేసీఆర్ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలతో విరుచుకుపడ్డ నాగం జనార్దన్ రెడ్డి మరో సంచలన విషయం వెల్లడించాడు. త్వరలోనే తెలంగాణ సీఎం కేసీఆర్ పత్రిక, టీవీ ఛానల్‌పై పరువు నష్టం దావా వేస్తానన్నది దాని సారాంశం. ప్రాజెక్టులకు అడ్డుపడుతున్నానని తనపై కేసీఆర్ మీడియా అసత్య ఆరోపణలను ప్రచారం చేస్తోందని మండిపడ్డాడు. అందుకే, ఈ నిర్ణయం తీసుకున్నానని వెల్లడించాడు. తాను ప్రాజెక్టులకు వ్యతిరేకం కాదని, వాటిపేరుతో జరుగుతున్న అవినీతికి మాత్రమే వ్యతిరేకమని స్పష్టంచేశాడు. అయితే, ఈక్రమంలో తాను న్యాయపోరాటం […]
BY sarvi3 July 2016 10:30 PM GMT
X
sarvi Updated On: 3 July 2016 10:46 PM GMT
కొంతకాలంగా కేసీఆర్ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలతో విరుచుకుపడ్డ నాగం జనార్దన్ రెడ్డి మరో సంచలన విషయం వెల్లడించాడు. త్వరలోనే తెలంగాణ సీఎం కేసీఆర్ పత్రిక, టీవీ ఛానల్‌పై పరువు నష్టం దావా వేస్తానన్నది దాని సారాంశం. ప్రాజెక్టులకు అడ్డుపడుతున్నానని తనపై కేసీఆర్ మీడియా అసత్య ఆరోపణలను ప్రచారం చేస్తోందని మండిపడ్డాడు. అందుకే, ఈ నిర్ణయం తీసుకున్నానని వెల్లడించాడు. తాను ప్రాజెక్టులకు వ్యతిరేకం కాదని, వాటిపేరుతో జరుగుతున్న అవినీతికి మాత్రమే వ్యతిరేకమని స్పష్టంచేశాడు. అయితే, ఈక్రమంలో తాను న్యాయపోరాటం సాగిస్తుంటే.. తనను తెలంగాణ ప్రాజెక్టుల వ్యతిరేకిగా చిత్రీకరించే కుట్రం జరుగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. అందుకే, తన ప్రయత్నాలపై కుట్ర సాగిస్తోన్న కేసీఆర్ మీడియాపై పరువునష్టం వేయాలని నిర్ణయించానని తెలిపాడు.
ఇంతకీ నాగం జనార్దన్ రెడ్డికి కేసీఆర్ ప్రభుత్వానికి గొడవ ఎక్కడ వచ్చిందో గుర్తుచేసుకుందాం. కొంతకాలంగా తెలంగాణ చేపడుతున్న పలు ప్రాజెక్టుల్లో నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని, ఇది అవినీతికి దారితీస్తుందని నాగం న్యాయస్థానాలను ఆశ్రయించడం.. అక్కడ ఆయనకు పరాభవం ఎదురవడం షరా మామూలైంది. దీంతో ప్రాజెక్టుల్లో ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకున్నా.. నాగం కావాలనే అడ్డుపడుతున్నాడని కేసీఆర్ పత్రిక, టీవీల్లో కథనాలు రావడం మొదలైంది. ఇటీవల నాగం తన ఆరోపణల స్వరం పెంచాడు. దీంతో పాలమూరు టీఆర్ ఎస్ నేతలు ఆయనపై దాడికి సైతం ప్రయత్నించారు. ఈ పరిణామంతో నాగం మరింత నొచ్చుకున్నారు. తానెన్నడూ తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకోవాలని చూడలేదని, అయినా తనపై దుష్ప్రచారం సాగిస్తోన్న వారిని వదలనని స్పష్టం చేశాడు. అందుకే ఈ విషయంలో కేసీఆర్ మీడియాను కోర్టుకీడుస్తానని చెప్పాడు. ఇప్పటికే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుల్లో కోర్టు చేత అక్షింతలు వేయించుకున్న నాగంకు కనీసం పరువు నష్టం కేసులోనైనా ఊరట లభిస్తుందో? లేదో?
Next Story