అద్దం
పూర్వం ఒక గ్రామంలో భార్యాభర్తలుండేవాళ్ళు. ఆ పాత కాలంలో ఆ గ్రామం వాళ్ళకు అద్దమంటే ఏమిటో తెలీదు అట్లాంటి పరిస్థితిలో పొలం పని చేస్తున్న భర్తకు ఒక అద్దం దొరికింది. ఆ అద్దంలో అతను తన ముఖం చూసుకు న్నాడు. అద్దం ప్రతిఫలిస్తుందన్న సంగతి అతనికి తెలీదు. ఆ అద్దంలో ఎవరో తనకు పరిచితమయిన వ్యక్తి ముఖం కనిపించింది. అతను అచ్చం అతని తండ్రి పోలిక దాంతో అతను చనిపోయిన తన తండ్రి ముఖం చూసి ఎంతో […]
పూర్వం ఒక గ్రామంలో భార్యాభర్తలుండేవాళ్ళు. ఆ పాత కాలంలో ఆ గ్రామం వాళ్ళకు అద్దమంటే ఏమిటో తెలీదు అట్లాంటి పరిస్థితిలో పొలం పని చేస్తున్న భర్తకు ఒక అద్దం దొరికింది. ఆ అద్దంలో అతను తన ముఖం చూసుకు న్నాడు. అద్దం ప్రతిఫలిస్తుందన్న సంగతి అతనికి తెలీదు. ఆ అద్దంలో ఎవరో తనకు పరిచితమయిన వ్యక్తి ముఖం కనిపించింది. అతను అచ్చం అతని తండ్రి పోలిక దాంతో అతను చనిపోయిన తన తండ్రి ముఖం చూసి ఎంతో సంతోషించాడు.
అతని దగ్గర ఒక పెట్టెవుంది దాంట్లో ఆ అద్దం దాచుకుని ప్రతిరోజూ తన తండ్రి ముఖాన్ని చూసి ఆనందించేవాడు. ప్రతి రోజూ పనికి వెళ్ళి సాయంత్రం తిరిగి రాగానే తన పెట్టె తెరిచి అద్దంలో చూసుకుని తండ్రి ఎదురుగా వున్నంత సంబరపడిపోయేవాడు.
కొన్నాళ్ళ తరువాత ఒక సమస్యవచ్చింది. ఒకసారి అతను పెట్టె తెరిచి ఏదో వస్తువుచూసి ఆనందిస్తున్నాడని భార్య పసి కట్టింది. భర్త బయటికి వెళ్ళాక ఆ పెట్టె తిప్పి దాంట్లోంచి అద్దం తీసిచూసింది. ఆ అద్దంలో అందమయిన ఒక స్త్రీ ముఖం చూసి ఆశ్చర్యపోయింది. తన భర్త మీద ఒక కన్నేసివుంచింది. అతనికి పరస్త్రీతో సంబంధముందని, ఆమె చిత్రాన్ని పెట్టలో దాచుకుని ప్రతిరోజూ చూసుకుని పరవశిస్తున్నాడని నిర్ణయించుకుంది. యిద్దరి మధ్య యిబ్బందులు మొదలయ్యాయి.
భర్తకు గుణపాఠం చెప్పాలని భార్య నిర్ణయించుకుంది. అందువల్ల ఆ రోజు సాయంత్రం ఆమె భర్తకు కాఫీ కాచివ్వలేదు. ఆ రోజుల్లో కేరళలో టీ అంతగా వుండేది కాదు.
భర్త కాఫీ అడిగాడు. బదుల్లేదు. పైగా బయటికి వెళ్ళి ఎక్కడయినా నీ కాఫీ నువ్వు తాగు’ అంది.
ఎక్కడ తాగమంటావు? అని అడిగాడు
‘ఇంకో దాన్ని వుంచుకున్నావు కదా! దాని యింటికి వెళ్ళు. నేను మా పుట్టింటికి పోతాను’ అంది.
ఎందుకలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? ఏమైందినీకు? అన్నాడు. నాకు కాదు, నీకే పిచ్చి. కావాలంటే నీ పెట్టంలో దాచుకున్నా నీ ప్రియురాలి బొమ్మచూడు’ అంది.
అతనికి ఆశ్చర్యం వేసింది. తన పెట్టెలో తండ్రిచిత్రం వుంది. ఈ ప్రియురాలి చిత్రం ఎక్కడి నించీ వచ్చింది? అని ఆశ్యర్యపోయాడు.
వెంటనే పెట్టె తెరిచి అద్దం చూశాడు. ఎప్పటిలాగే అద్దం అతన్ని ప్రతి ఫలించింది. ఎప్పటిలాగే అతను అది తన తండ్రి చిత్రమనుకున్నాడు.
పిచ్చిదానా! నా దగ్గరున్నది నా తండ్రి చిత్రం. నువ్వు భ్రమ పడ్డావు’ కావాలంటే చూడు అని అద్దం భార్య కిచ్చాడు యింకో స్త్రీ అనుకుని ‘ఎందుకు బుకాయిస్తారు. చూడండి. అంది.
భర్త తన ప్రతిబింబాన్ని చూసుకుని కావాలంటే వచ్చినువ్వుచూడు’ అని భార్యను దగ్గరికి పిలిచాడు. ఆమె దగ్గరికి వచ్చి అద్దంలో చేసింది. భర్త పక్కనే అద్దంలో తనూ కనిపించింది. అప్పటికి కానీ అద్ధం తమ ప్రతిబింబాల్ని ప్రదర్శిస్తుందన్న స్పృహ వాళ్ళకు కలగలేదు.!
దాంతో భార్యా భర్తాలిద్దరూ నవ్వుకున్నారు.
– సౌభాగ్య