Telugu Global
Cinema & Entertainment

కబాలిపై క్లారిటీ వచ్చేసింది

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కబాలి సినిమా ఇక ఎంత మాత్రం వాయిదా పడదు. ఈ సినిమాను ఎట్టిపరిస్థితుల్లో ఈ నెలలోనే విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించారు. సినిమాకు సంబంధించి ఇన్నాళ్లు అడ్డుగా ఉన్న ఓ డీల్ సాకారం అవ్వడంతో విడుదల తేదీని త్వరలోనే ప్రకటించనున్నారు. ఫాక్స్ స్టార్ ఇండియా సంస్థ… కబాలి ఉత్తర భారత హక్కుల్ని పొందింది. కేవలం బాలీవుడ్ రిలీజ్ తో పాటు… ఓవర్సీస్ విడుదల హక్కులు సైతం ఈ సంస్థకే దక్కాయి. ఈ […]

కబాలిపై క్లారిటీ వచ్చేసింది
X

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కబాలి సినిమా ఇక ఎంత మాత్రం వాయిదా పడదు. ఈ సినిమాను ఎట్టిపరిస్థితుల్లో ఈ నెలలోనే విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించారు. సినిమాకు సంబంధించి ఇన్నాళ్లు అడ్డుగా ఉన్న ఓ డీల్ సాకారం అవ్వడంతో విడుదల తేదీని త్వరలోనే ప్రకటించనున్నారు. ఫాక్స్ స్టార్ ఇండియా సంస్థ… కబాలి ఉత్తర భారత హక్కుల్ని పొందింది. కేవలం బాలీవుడ్ రిలీజ్ తో పాటు… ఓవర్సీస్ విడుదల హక్కులు సైతం ఈ సంస్థకే దక్కాయి. ఈ డీల్ వర్కవుట్ అవ్వలేదు కాబట్టే ఇన్నాళ్లూ కబాలి విడుదల జరగలేదు. తాజాగా డీల్ సాకారం అవ్వడంతో సినిమా ఈనెల 15 లేదా 22న విడుదలయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ మేరకు జులై రిలీజ్ అంటూ కబాలి పోస్టర్ కూడా ఒకటి విడుదల చేశారు. ఇక ఈ సినిమా తెలుగు హక్కుల విషయానికొస్తే…. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన షణ్ముఖ ఫిలిమ్స్ సంస్థ కబాలి రైట్స్ దక్కించుకుంది. అందర్నీ ఆశ్చర్యపరుస్తూ… ఏకంగా 32 కోట్ల రూపాయల మొత్తానికి కబాలి హక్కులు దక్కించుకున్నారు. ప్రవీణ్, కేపీ చౌదరి అనే ఇద్దరు వ్యక్తులు ఈ మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టారు. కేవలం డిస్ట్రిబ్యూషన్ రైట్స్ మాత్రమే కాకుండా… ఈ 32 కోట్ల రూపాయల్లోనే శాటిలైట్ రైట్స్ కూడా ఉన్నాయి.

First Published:  3 July 2016 5:14 AM IST
Next Story