చంద్రబాబుకు చెప్పాకే జగన్ తో మాట్లాడుతానన్నా వినలేదు...
ఇటీవల 14 రోజుల పాటు దీక్ష చేసిన కాపు నేత ముద్రగడ పద్మనాభం తన అనుభవాలను సాక్షి టీవీతో పంచుకున్నారు. దీక్ష సమయంలో తనను, తన కుటుంబసభ్యులను దారుణంగా ట్రీట్ చేశారని వాపోయారు. పత్రిక గానీ, టీవీ గానీ ఏమీ లేకుండా చేసి వేధించారన్నారు. కనీసం తన సొంత చెల్లిని కూడా అనుమతించలేదని వాపోయారు. తాము నిద్రపోకూడదన్న ఉద్దేశంతో డోర్ వద్ద శబ్దాలు చేయడం, ఇనుప టేబుళ్ల పదేపదే లాగడం లాంటివి చేసేవారని అన్నారు. డాక్టర్లు, నర్సులు […]
ఇటీవల 14 రోజుల పాటు దీక్ష చేసిన కాపు నేత ముద్రగడ పద్మనాభం తన అనుభవాలను సాక్షి టీవీతో పంచుకున్నారు. దీక్ష సమయంలో తనను, తన కుటుంబసభ్యులను దారుణంగా ట్రీట్ చేశారని వాపోయారు. పత్రిక గానీ, టీవీ గానీ ఏమీ లేకుండా చేసి వేధించారన్నారు. కనీసం తన సొంత చెల్లిని కూడా అనుమతించలేదని వాపోయారు. తాము నిద్రపోకూడదన్న ఉద్దేశంతో డోర్ వద్ద శబ్దాలు చేయడం, ఇనుప టేబుళ్ల పదేపదే లాగడం లాంటివి చేసేవారని అన్నారు. డాక్టర్లు, నర్సులు మాత్రం తమను బాగా చూసుకున్నారని చెప్పారు. తానున్న ఆస్పత్రి వద్ద పెట్టిన పోలీసుల్లో సగం మందిని తుని మీటింగ్ వద్ద ఉంచినా రైలు తగలబడేది కాదన్నారు. కానీ ప్రభుత్వమే కావాలని రైలు తగలబెట్టేలా చేసిందని… అలా చేయడం ద్వారా కాపులను చెడ్డవారిగా చిత్రీకరించేందుకు కుట్ర చేశారని ఆరోపించారు.
తొలిసారి దీక్ష చేసినప్పుడు కళావెంకట్రావు, అచ్చెన్నాయుడు తదితరులు వచ్చి కేసులన్నీ ఎత్తివేస్తామని చెప్పారన్నారు. ఆ సమయంలో తాను సీఎంకు కృతజ్ఞతలు చెప్పేందుకు ప్రయత్నించానని కానీ ఆయన మాట్లాడలేదన్నారు. బొడ్డుభాస్కరరావు ద్వారా చంద్రబాబుతో ఫోన్‌లో మాట్లాడేందుకు ప్రయత్నించానన్నారు. భాస్కరరావు ఎన్నిసార్లు ఫోన్ చేసినా సీఎం విమానంలో ఉన్నారు. మీటింగ్‌లో ఉన్నారంటూ దాటవేశారని చెప్పారు. చివరకు సీఎం నీతో మాట్లాడేందుకు విముఖంగా ఉన్నారని బొడ్డుభాస్కరరామారావు తనతో చెప్పారని అన్నారు.
తమ పోరాటానికి జగన్ కూడా మద్దతు ఇచ్చారని కాబట్టి తొలుత చంద్రబాబుకు కృతజ్ఞతలు చెప్పి ఆ తర్వాతే జగన్‌తో మాట్లాడి కృతజ్ఞతలు చెబుతానని బొడ్డు భాస్కరరామారావుకు వివరించినట్టు చెప్పారు. కానీ ఇప్పటి వరకు చంద్రబాబు తనతో మాట్లాడేందుకు ఇష్టపడడం లేదన్నారు ముద్రగడ. టీడీపీ నేతలు పదేపదే విజయభాస్కరెడ్డి ఇచ్చింది చెత్తజీవో అంటున్నారని… ఆ మంచి జీవో ఏంటో ఇప్పటి ప్రభుత్వం ఇవ్వొచ్చు కదా అని అడిగారు ముద్రగడ. నడవడానికి ఇబ్బంది పడుతున్న తన పెద్దకొడుకును కూడా పోలీసులు లాక్కెల్లేందుకు ప్రయత్నించారని.. అయితే ఒక కానిస్టేబుల్ దేవుడిలా అడ్డుపడ్డారని ముద్రగడ చెప్పారు. తాము 1995 నుంచి కూడా బీసీలకు అన్యాయం జరగకుండా కాపులకు రిజర్వేషన్ ఇవ్వాలని కోరుతున్నామని కానీ… అప్పటికే ఉన్న రెండు దినపత్రికలు ఆ మాటలు మాత్రం ప్రచురించకుండా కట్ చేస్తూ వచ్చాయని ముద్రగడ ఆవేదన చెందారు. ఏదీ ఏమైనా కాపు ఉద్యమం మాత్రం ఆగే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు.
Click on Image to Read: