మీ వేతనం ఇప్పుడే తెచ్చుకోండి.. 11 రోజులు బ్యాంకులు బంద్!
మీరు నెలసరి వేతనజీవులా? ప‌్రతిరోజూ చెక్కులు, డీడీలు ఇతర బ్యాంకు లావాదేవీలు చేస్తుంటారా? అయితే ఇప్పుడే త్వరపడండి.. ఎందుకంటే.. జూలై నెలలో బ్యాంకులకు ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 11 రోజుల పాటు సెలవులు వచ్చాయి. దేశంలో అత్యధికంగా సెలవులు తీసుకుంటున్న సంస్థలుగా దేశంలోని దాదాపు అన్ని జాతీయ బ్యాంకులు ఇప్పటికే గుర్తింపు పొందాయి. ఇటీవల నాలుగో శనివారాలు కూడా బ్యాంకులకు సెలవులుగా ప్రకటించడంతో వీరికి ఏడాదికి 12 సెలవులు అదనంగా వస్తున్నాయి. అయితే, ఆన్‌లైన్, […]
BY sarvi3 July 2016 3:38 AM IST
X
sarvi Updated On: 3 July 2016 6:25 AM IST
మీరు నెలసరి వేతనజీవులా? ప‌్రతిరోజూ చెక్కులు, డీడీలు ఇతర బ్యాంకు లావాదేవీలు చేస్తుంటారా? అయితే ఇప్పుడే త్వరపడండి.. ఎందుకంటే.. జూలై నెలలో బ్యాంకులకు ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 11 రోజుల పాటు సెలవులు వచ్చాయి. దేశంలో అత్యధికంగా సెలవులు తీసుకుంటున్న సంస్థలుగా దేశంలోని దాదాపు అన్ని జాతీయ బ్యాంకులు ఇప్పటికే గుర్తింపు పొందాయి. ఇటీవల నాలుగో శనివారాలు కూడా బ్యాంకులకు సెలవులుగా ప్రకటించడంతో వీరికి ఏడాదికి 12 సెలవులు అదనంగా వస్తున్నాయి. అయితే, ఆన్‌లైన్, ఏటీఎం సేవలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని బ్యాంకులు ప్రకటించాయి.
సెలవుల జాబితా ఇదే!
3 జూలై- ఆదివారం, 6వ తేదీ రంజాన్, 9న రెండో శనివారం, ఆ వెంటనే 10వ తేదీ ఆదివారం, మరుసటి రోజు సోమవారం 11వ తేదీ బ్యాంకులు తెరుచుకుంటాయి. తరువాతరోజు మరో ఝలక్! బ్యాంకుల విలీనాన్ని వ్యతిరేకిస్తూ.. 12వ తేదీ, 13వతేదీ అంటే వరుసగా రెండురోజులు బ్యాంకు సిబ్బంది సమ్మె చేయనున్నారు. ఇక , 17, 24, 31 తేదీలు ఆదివారాలయ్యాయి. 23వ తేదీ (శనివారం).. నాలుగో శనివారం సెలవు! 29వ తేదీ (శుక్రవారం) కూడా బ్యాంకులకు మూతే! ఈ సారి యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్లు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయి.
Next Story