వైసీపీ ఎమ్మెల్యే రాజీనామా... నిరసనగానేనా...
కడప జిల్లా మైదుకూరు వైసీపీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. స్పీకర్ కు ఫ్యాక్స్‌తో పాటు కొరియర్‌లోనూ రఘురామిరెడ్డి రాజీనామా లేఖను పంపారు. అధికారపార్టీకి తొత్తులుగా మారిన అధికారులు పదేపదే ప్రొటోకాల్‌ను ఉల్లంఘిస్తూ తనను అవమానపరుస్తున్నారని అందుకే రాజీనామా చేసినట్టు రఘురామిరెడ్డి వివరించారు. తనను వివిధ సందర్భాలలో అధికారులు అవమానించిన తీరును లేఖలో స్పీకర్‌కు వివరించారాయన. మైదుకూరులో ఎమ్మెల్యేను కాదని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్, మంత్రి యనమల రామకృష్ణుడి వియ్యంకుడు అయిన సుధాకర్ యాదవ్‌కు అధికారులు సలాం కొడుతున్నారన్న […]
కడప జిల్లా మైదుకూరు వైసీపీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. స్పీకర్ కు ఫ్యాక్స్‌తో పాటు కొరియర్‌లోనూ రఘురామిరెడ్డి రాజీనామా లేఖను పంపారు. అధికారపార్టీకి తొత్తులుగా మారిన అధికారులు పదేపదే ప్రొటోకాల్‌ను ఉల్లంఘిస్తూ తనను అవమానపరుస్తున్నారని అందుకే రాజీనామా చేసినట్టు రఘురామిరెడ్డి వివరించారు. తనను వివిధ సందర్భాలలో అధికారులు అవమానించిన తీరును లేఖలో స్పీకర్‌కు వివరించారాయన. మైదుకూరులో ఎమ్మెల్యేను కాదని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్, మంత్రి యనమల రామకృష్ణుడి వియ్యంకుడు అయిన సుధాకర్ యాదవ్‌కు అధికారులు సలాం కొడుతున్నారన్న భావన ఉంది.
శుక్రవారం రంజాన్ తోఫా పంపిణి కార్యక్రమానికి ఎమ్మెల్యేరఘురామిరెడ్డిని కూడా అధికారులు ఆహ్వానించారు. కానీ కార్యక్రమం మొదలయ్యే ముందు వేదికపైకి ప్రొటోకాల్ ప్రకారం ఎమ్మెల్యేను కాకుండా టీడీపీ ఇన్‌చార్జ్ సుధాకర్ యాదవ్‌ను అధికారులు ఆహ్వానించారు. దీంతో అవమానంగా భావించిన రఘురామిరెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇలా ఎమ్మెల్యేను కాదని పార్టీ ఇన్‌చార్జ్‌ను వేదికపైకి పిలవడం నిబంధనలకు విరుద్ధమని చెప్పినా అధికారులు మాత్రం మంత్రి వియ్యంకుడి సేవలోనే తరించారు.
గతంలో సీఎం టూర్ సమయంలోనూ రఘురామిరెడ్డికి ఇలాంటి ప్రొటోకాల్ అవమానమే ఎదురైంది. ఇటీవల ఏరువాక కార్యక్రమానికి కూడా ఎమ్మెల్యేను ఆహ్వానించిన అధికారులు… తీరా చూస్తే ఎమ్మెల్యే రాకముందే టీడీపీ ఇన్‌చార్జ్ సుధాకర్ యాదవ్‌తో జరిపించేశారు. దీంతో ప్రభుత్వ తీరును నిరసిస్తూ రఘురామిరెడ్డి రాజీనామా చేశారు. ఇది నిరసనగా చేసిన రాజీనామాగానే భావిస్తున్నారు. అయితే చంద్రబాబు కనుసన్నల్లో అసెంబ్లీ వ్యవహారాలు నడుస్తున్న తీరు, తమకు ఇబ్బంది కలిగించేలా ఉన్న నిబంధనలు క్షణాల్లో తొలగించి వేస్తూ అసెంబ్లీని నడుపుతున్న తీరును చూసిన తర్వాత ఇలా నిరసనగా రాజీనామా చేయడం కూడా ఒక్కోసారి వికటించవచ్చు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ నిష్పకపాతంగా వ్యవహరించకుండా పార్టీ కార్యకర్తలాగా వ్యవహరిస్తున్నాడని అందువల్లే ఇలాంటివి జరుగుతున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. దీనికితోడు గవర్నర్ గుడులు, గోపురాలకే పరిమితం కాకుండా తాను గవర్నర్ ని అనే విషయం అప్పుడప్పుడైనా గుర్తుంచుకొని వ్యవహరిస్తే రాజ్యాంగ నిబంధనలను అధికారపార్టీ ఇంతగా అవహేళన చేయదు అని అంటున్నారు.
Click on Image to Read: