చెన్నై టెకీ హత్య కేసులో నిందితుడి అరెస్టు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన చెన్నై టెక్కీ స్వాతి హత్య కేసు నిందితుడిని పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. స్వాతిని తిరునల్వేలికి చెందిన రామ్‌కుమార్ (22) హత్య చేసినట్లుగా గుర్తించారు. ఈ నెల 24న చెన్నైలోని నుగంబాకం రైల్వేస్టేషన్‌లో స్వాతిని అత్యంత కిరాతకంగా వేటకత్తితో నరికి చంపిన విషయం తెలిసిందే. హంతకుడిని వీలైనంత త్వరగా పట్టుకోవాలన్న డిమాండ్ పెరిగిపోయింది. స్వాతి బంధువులు, స్నేహితులు సోషల్ మీడియాలో భారీ ప్రచారోద్యమాన్నే లేవదీశారు. దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులకు విచారణలో కొన్ని విషయాలు […]
BY sarvi2 July 2016 4:37 AM IST
X
sarvi Updated On: 2 July 2016 6:13 AM IST
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన చెన్నై టెక్కీ స్వాతి హత్య కేసు నిందితుడిని పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. స్వాతిని తిరునల్వేలికి చెందిన రామ్‌కుమార్ (22) హత్య చేసినట్లుగా గుర్తించారు. ఈ నెల 24న చెన్నైలోని నుగంబాకం రైల్వేస్టేషన్‌లో స్వాతిని అత్యంత కిరాతకంగా వేటకత్తితో నరికి చంపిన విషయం తెలిసిందే. హంతకుడిని వీలైనంత త్వరగా పట్టుకోవాలన్న డిమాండ్ పెరిగిపోయింది. స్వాతి బంధువులు, స్నేహితులు సోషల్ మీడియాలో భారీ ప్రచారోద్యమాన్నే లేవదీశారు. దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులకు విచారణలో కొన్ని విషయాలు తెలిశాయి. వాటి ఆధారంగా నిందితుడిని తిరునల్వేలికి చెందిన రామ్‌కుమార్‌గా గుర్తించారు. శుక్రవారం అర్ధరాత్రి అతని ఇంటిపై దాడి చేశారు. పోలీసుల రాకను ముందుగానే పసిగట్టిన రామ్ వారి నుంచి తప్పించుకునేందుకు బ్లేడుతో గొంతు కోసుకున్నాడు. నిందితుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడటంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. మొత్తానికి ప్రాణాపాయం తప్పింది. దీంతో శనివారం సాయంత్రం నిందితుడిని మీడియా ముందు ప్రవేశ పెడతామని చెన్నై పోలీసులు ప్రకటించారు.
సోషల్ మీడియా ద్వారా ప్రచార ఉద్యమం..!
కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు రైల్వేస్టేషన్ పరిసరాల్లోని సీసీ కెమెరా ఫుటేజీలని పరిశీలించారు. వాటిలో చాలా చోట్ల నిందితుడికి సంబంధించిన అస్పష్ట చిత్రాలే వచ్చాయి. ఈ కేసులో తొలుత హంతకుడికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో ఎలా ముందుకెళ్లాలో తెలియక పోలీసులు తలలు పట్టుకున్నారు. స్వాతి బంధువులు, స్నేహితులు సోషల్ మీడియాలో భారీ ప్రచారోద్యమాన్నే ప్రారంభించడంతో పోలీసులపై ఒత్తిడి రెట్టింపయింది. అదే సమయంలో స్వాతి కుటుంబ సభ్యులు చెప్పిన వివరాలతో పోలీసులు కీలక ఆధారాలు లభించాయి. వాటి ఆధారంగా గత 3 నెలల నుంచి స్వాతిని ఓ పోకిరీ యువకుడు అనుసరిస్తున్నాడని తెలిసింది. దీని ఆధారంగా స్వాతి ఇంటి నుంచి రైల్వేస్టేషన్ వరకు ఉన్న అన్ని సీసీ టీవీ కెమెరాలను విశ్లేషించారు. ఎట్టకేలకు నిందితుడి ఆనవాళ్లు గుర్తించిన పోలీసులు అతని చిత్రాన్ని సాధించారు. అలా లభించిన వివరాలతో నిందితుడిని తిరునల్వేలికి చెందిన రామ్‌కుమార్‌గా గుర్తించి, అరెస్టు చేశారు.
Next Story