వైసీపీ అనర్హత పిటిషన్లపై స్పీకర్ సంచలన నిర్ణయం
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై వైసీపీ ఇచ్చిన అనర్హత పిటిషన్ల విషయంలో ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఊహించని నిర్ణయం తీసుకున్నారు. అందరిని ఆశ్చర్యపరుస్తూ వైసీపీ ఇచ్చిన అనర్హత పిటిషన్లను స్పీకర్ డిస్మిస్ చేశారు. టీడీపీలోకి ఫిరాయించిన 19 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ సాక్ష్యాలతో సహా వైసీపీ ఫిర్యాదు చేసింది. పిటిషన్లలో లోపాలున్నాయంటూ 13 మందిపై పిటిషన్లను తిరస్కరించారు కోడెల. వైసీపీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి సమక్షంలోనే కండువాలు కప్పుకుని పార్టీ ఫిరాయించడాన్ని సభ్యసమాజం మొత్తం చూసింది. అయినా […]
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై వైసీపీ ఇచ్చిన అనర్హత పిటిషన్ల విషయంలో ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఊహించని నిర్ణయం తీసుకున్నారు. అందరిని ఆశ్చర్యపరుస్తూ వైసీపీ ఇచ్చిన అనర్హత పిటిషన్లను స్పీకర్ డిస్మిస్ చేశారు. టీడీపీలోకి ఫిరాయించిన 19 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ సాక్ష్యాలతో సహా వైసీపీ ఫిర్యాదు చేసింది. పిటిషన్లలో లోపాలున్నాయంటూ 13 మందిపై పిటిషన్లను తిరస్కరించారు కోడెల.
వైసీపీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి సమక్షంలోనే కండువాలు కప్పుకుని పార్టీ ఫిరాయించడాన్ని సభ్యసమాజం మొత్తం చూసింది. అయినా సరే అనర్హత పిటిషన్లను స్పీకర్ తిరస్కరించడం ఆశ్చర్యంగానే ఉంది. ఇటీవల ఒక తెలుగు టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్యూలోనూ స్పీకర్ కోడెల ఈ పిటిషన్లపై స్పందించారు. వైసీపీ ఇచ్చిన పిటిషన్లలో కొన్ని నిబంధనల ప్రకారం లేవని కూడా చెప్పారు. మొన్నటి ఎన్నికల్లో తాను రూ. 11.5 కోట్లు ఖర్చుపెట్టానని చెప్పిన ఇంటర్వ్యూలోనే కోడెల ఈ వ్యాఖ్యలు చేశారు. అన్నట్టుగానే పిటిషన్లను తిరస్కరించారు. మొత్తం మీద స్పీకర్ కోడెల తీరు మరోసారి చర్చనీయాంశమైంది.
Click on Image to Read: