Telugu Global
Cinema & Entertainment

సాయిధర్మతేజ సరసన తమన్న

త్వరలోనే ఓ మల్టీస్టారర్ సినిమా ప్లాన్ చేస్తున్నాడు గౌతమ్ మీనన్. ఆ ప్రాజెక్టుకు గౌతమ్ మీనన్ నిర్మాతగా మాత్రమే వ్యవహరిస్తాడు. వికటన్ అనే వ్యక్తి దర్శకుడిగా ఉంటాడు. ఈ సినిమా తెలుగు వెర్షన్ కోసం సాయిధర్మతేజను తీసుకున్నారు. సాయి సరసన తమన్న హీరోయిన్ గా నటించనుంది. మరో కీలక పాత్ర కోసం అనుష్కను కూడా తీసుకున్నారు. తమిళ వెర్షన్ హీరోను ఇంకా సెలక్ట్ చేయాల్సి ఉంది. ఈ సినిమాలో సాయిధర్మతేజ తో పాటు మరో హీరో కూడా […]

సాయిధర్మతేజ సరసన తమన్న
X

త్వరలోనే ఓ మల్టీస్టారర్ సినిమా ప్లాన్ చేస్తున్నాడు గౌతమ్ మీనన్. ఆ ప్రాజెక్టుకు గౌతమ్ మీనన్ నిర్మాతగా మాత్రమే వ్యవహరిస్తాడు. వికటన్ అనే వ్యక్తి దర్శకుడిగా ఉంటాడు. ఈ సినిమా తెలుగు వెర్షన్ కోసం సాయిధర్మతేజను తీసుకున్నారు. సాయి సరసన తమన్న హీరోయిన్ గా నటించనుంది. మరో కీలక పాత్ర కోసం అనుష్కను కూడా తీసుకున్నారు. తమిళ వెర్షన్ హీరోను ఇంకా సెలక్ట్ చేయాల్సి ఉంది. ఈ సినిమాలో సాయిధర్మతేజ తో పాటు మరో హీరో కూడా నటించే అవకాశం ఉంది. ప్రస్తుతం గౌతమ్ మీనన్.. .సాహసం శ్వాసగా సాగిపో అనే సినిమా పనిలో బిజీగా ఉన్నాడు. నాగచైతన్య హీరోగా నటిస్తున్న ఈ సినిమా థియేటర్లలోకి వచ్చిన వెంటనే… సాయిధర్మతేజ ప్రాజెక్టు పట్టాలపైకి వస్తుంది. వాస్తవానికి ఈ సినిమాను బన్నీ చేయాల్సింది. కానీ ఇప్పటికే కొన్ని ప్రాజెక్టులు ఒప్పుకోవడం వల్ల.. బన్నీ ఆ సినిమా నుంచి తప్పుకోవడం…… సాయిధర్మతేజకు అవకాశం రావడం చకచకా జరిగిపోయాయి. త్వరలోనే ఈ ప్రాజెక్టుు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ బయటకువస్తాయి. తెలుగు-తమిళ భాషల్లో ఒకేసారి ఈ సినిమాను నిర్మిస్తారు.

First Published:  2 July 2016 2:10 AM IST
Next Story