కేసీఆర్ హరిత 'రాశి' వర్కవుట్ అవుతుందా?
మొక్కలు నాటండి.. పచ్చదనానికి పాటుపడండి.. ఇది అందరూ చెప్పే విషయమే! కానీ, ఆచరణ వరకు వచ్చేసరికి అంతా నిర్లక్ష్యం వహిస్తారు. అందుకే, దీనికి జాతక బలాన్ని జోడిస్తే.. మరింత ప్రభావవంతంగా అమలు చేయవచ్చని కేసీఆర్ ప్రభుత్వం ఆలోచిస్తోంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన హరిత హారంతో తెలంగాణను ఆకుపచ్చ తెలంగాణగా మార్చాలని కేసీఆర్ గత కొంతకాలంగా పిలుపునిస్తున్నారు. తొలకరి మొదలైంది. వ్యవసాయ పనులు కూడా మొదలయ్యాయి. మొక్కలు నాటేందుకు ఇదే అనువైన సమయం. ఇప్పుడు నాటితేనే మొక్కలు […]
BY sarvi2 July 2016 4:55 AM IST
X
sarvi Updated On: 2 July 2016 5:58 AM IST
మొక్కలు నాటండి.. పచ్చదనానికి పాటుపడండి.. ఇది అందరూ చెప్పే విషయమే! కానీ, ఆచరణ వరకు వచ్చేసరికి అంతా నిర్లక్ష్యం వహిస్తారు. అందుకే, దీనికి జాతక బలాన్ని జోడిస్తే.. మరింత ప్రభావవంతంగా అమలు చేయవచ్చని కేసీఆర్ ప్రభుత్వం ఆలోచిస్తోంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన హరిత హారంతో తెలంగాణను ఆకుపచ్చ తెలంగాణగా మార్చాలని కేసీఆర్ గత కొంతకాలంగా పిలుపునిస్తున్నారు. తొలకరి మొదలైంది. వ్యవసాయ పనులు కూడా మొదలయ్యాయి. మొక్కలు నాటేందుకు ఇదే అనువైన సమయం. ఇప్పుడు నాటితేనే మొక్కలు బ్రతుకుతాయి. అందుకే, ఈ సమయానికి పక్కా వ్యూహంతో రెండో విడత హరితహారం పనులు మొదలు పెట్టేందుకు తెలంగాణ సర్కారు సిద్ధమైంది.
మీది ఏ రాశి.. మీది ఫలానా రాశి అయితే.. ఫలానా మొక్క నాటండి. ఇది ఈ హరితహారంలో త్వరలో అవలంబించబోయే కొత్త పద్ధతి. కేవలం నీతి వ్యాక్యాలు చెబితే.. పనులు పూర్తిస్థాయిలో జరగవు. దానికి సంప్రదాయం.. జాతకాలు జోడిస్తే.. సాధ్యమైనంత ఎక్కువమందిని పథకంలో భాగస్వామ్యం చేసే వీలుంది. అందుకే ఈ సూత్రాన్ని అమలు చేసేందుకు సర్వం సిద్ధం చేసుకుంది తెలంగాణ సర్కారు. ఈ మేరకు హరితహారం అమలుపై తెలంగాణ సచివాలయంలో సీఎం కేసీఆర్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇదేం కొత్త పద్ధతి కాదని, పూర్వకాలం నుంచి మనదేశంలో అమలులో ఉన్నదేనని కేసీఆర్ అన్నారు. రాశి, నక్షత్రం ఆధారంగా మొక్కలు నాటించాల్సిన బాధ్యతలను అధికారులు దగ్గరుండి చూసుకోవాలని ఆదేశించారు. నాటిన మొక్కల రక్షణకు కూడా ప్రణాళిక రూపొందించాలని సూచించారు.
హరితహారానికి జాతకాలు – నక్షత్రాలకు లంకె పెట్టిన సీఎం కేసీఆర్‌పై ప్రతిపక్షాలు పెద్దగా విమర్శించే అవకాశాలు లేవు. ఒక్క కమ్యూనిస్టులు మినహా.. మిగిలిన ఏ పార్టీ ఈ పథకాన్ని పెద్దగా తప్పుబట్టరని గులాబీ నేతలు దీమాగా ఉన్నారు. ముఖ్యంగా బీజేపీ నేతలు ఈ విషయంలో ఎలాంటి ఆరోపణలకు దిగకుండా.. సర్కారుతో కలిసి వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఒకవేళ తెలుగుదేశంలో ఒకరిద్దరు మినహా మిగిలిన వారు కూడా వ్యతిరేకించరన్నది వారి వ్యూహంగా కనిపిస్తోంది. ఈ దేశంలో కోట్లాది మంది రాశి- నక్షత్రాలు చూసే పెళ్లిళ్లు చేసుకుంటున్నారు కాబట్టి.. తప్పకుండా తమ ప్లాన్ వర్కవుటవుతుందన్ని సీఎం కేసీఆర్ వ్యూహంగా కనిపిస్తోంది.
Next Story