Telugu Global
Cinema & Entertainment

జనతా గ్యారేజీ అప్ డేట్స్

కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేస్తున్న జనతా గ్యారేజీ సినిమా షూటింగ్ క్లయిమాక్స్ కు చేరుకుంది. శనివారానికి ఈ సినిమా టాకీపార్ట్ పూర్తయిపోతుంది. 9వ తేదీ నుంచి కేరళ షెడ్యూల్ మొదలవుతుంది. ఇది కూడా ఓ వారంలో కంప్లీట్ చేసి, తర్వాత ఫారిన్ షెడ్యూల్ ప్లాన్ చేశారు. ఫారిన్ షెడ్యూల్ కూడా వీలైనంత త్వరగా పూర్తిచేసి, ఆడియో ఫంక్షన్ ను గ్రాండ్ గా  సెలబ్రేట్ చేయాలని నిర్ణయించారు. ఫారిన్ షెడ్యూల్ తో జనతా గ్యారేజీ […]

జనతా గ్యారేజీ అప్ డేట్స్
X

కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేస్తున్న జనతా గ్యారేజీ సినిమా షూటింగ్ క్లయిమాక్స్ కు చేరుకుంది. శనివారానికి ఈ సినిమా టాకీపార్ట్ పూర్తయిపోతుంది. 9వ తేదీ నుంచి కేరళ షెడ్యూల్ మొదలవుతుంది. ఇది కూడా ఓ వారంలో కంప్లీట్ చేసి, తర్వాత ఫారిన్ షెడ్యూల్ ప్లాన్ చేశారు. ఫారిన్ షెడ్యూల్ కూడా వీలైనంత త్వరగా పూర్తిచేసి, ఆడియో ఫంక్షన్ ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేయాలని నిర్ణయించారు. ఫారిన్ షెడ్యూల్ తో జనతా గ్యారేజీ షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది.

దేవిశ్రీప్రసాద్ కంపోజ్ చేసిన జనతా గ్యారేజీ పాటల్ని మొదట అమెరికాలో విడుదల చేయాలనుకున్నారు. కానీ ఆ ఆలోచన విరమించుకున్నారు. ఆమధ్య ఖమ్మంలో ఆడియో సెలబ్రేట్ చేస్తారని వార్తలొచ్చినా అందులో కూడా వాస్తవం లేదని తేలిపోయింది. హైదరాబాద్ లోనే ఈనెల 22న జనతా గ్యారేజీ పాటల్ని లాంఛ్ చేయాలని నిర్ణయించారు. నాన్నకు ప్రేమతో సినిమా తర్వాత తారక్ చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఆగస్ట్ 12న జనతా గ్యారేజీని విడుదలచేయాలని నిర్ణయించారు.

First Published:  2 July 2016 2:01 AM IST
Next Story