ఆత్మహత్య నుండి మహిళను కాపాడిన రైల్వే పోలీస్!
ముంబయిలోని జోగేశ్వరీ రైల్వే స్టేషన్లో రైలుకి ఎదురెళ్లి ఆత్మహత్యకు ప్రయత్నించిన ఒక మహిళను రైల్వే ప్రొటెక్షన్ ఫోర్సుకి చెందిన జైనేంద్ర యాదవ్ చాకచక్యంగా తప్పించాడు. 4వ నెంబరు ప్లాట్‌ఫామ్‌మీద గస్తీ తిరుగుతున్న యాదవ్కి ఒక మహిళ రైలు పట్టాలమీదకు దూకటం కనిపించింది. దూర ప్రాంతాలకు వెళ్లే రైళ్లకు మాత్రమే వినియోగించే, ఎవరూ లేని ట్రాక్ మీదకు ఆమె వెళ్లటం అతను చూశాడు. అనుమానం వచ్చి వెంబడించాడు. అప్పటికే ఆ మహిళ వేగంగా దూసుకువస్తున్న రైలుకి ఎదురుగా వెళ్లటం […]
ముంబయిలోని జోగేశ్వరీ రైల్వే స్టేషన్లో రైలుకి ఎదురెళ్లి ఆత్మహత్యకు ప్రయత్నించిన ఒక మహిళను రైల్వే ప్రొటెక్షన్ ఫోర్సుకి చెందిన జైనేంద్ర యాదవ్ చాకచక్యంగా తప్పించాడు. 4వ నెంబరు ప్లాట్‌ఫామ్‌మీద గస్తీ తిరుగుతున్న యాదవ్కి ఒక మహిళ రైలు పట్టాలమీదకు దూకటం కనిపించింది. దూర ప్రాంతాలకు వెళ్లే రైళ్లకు మాత్రమే వినియోగించే, ఎవరూ లేని ట్రాక్ మీదకు ఆమె వెళ్లటం అతను చూశాడు. అనుమానం వచ్చి వెంబడించాడు.
అప్పటికే ఆ మహిళ వేగంగా దూసుకువస్తున్న రైలుకి ఎదురుగా వెళ్లటం గమనించాడు. వెంటనే పరుగెత్తుకుని వెళ్లి ఆమెని పట్టాలమీద నుండి తప్పించాడు. మరికొంతమంది రైల్వే సిబ్బంది సహాయంలో ఆమెని స్టేషన్ మాస్టర్ ఆఫీస్‌కి చేర్చిన యాదవ్ ఆమె వివరాలను అడిగాడు. ఆ మహిళ తన పేరు నైనా తావ్డే అని, చనిపోవడానికే తాను అక్కడికి వచ్చినట్టుగా తెలిపింది. అంతకుమించి వివరాలు చెప్పకపోవటంతో ఆమె బ్యాగులో ఉన్న ఫోన్ నెంబర్ల ఆధారంగా ఆర్‌పిఎఫ్ పోలీసులు ఆమె ఇంటికి పోన్ చేశారు. తరువాత నైనాను తన భర్త నగేష్‌కి అప్పగించారు. తన భార్య కొంతకాలంగా మానసిక సమస్యలతో బాధపడుతున్నదని, ఇంట్లోంచి చెప్పకుండా వచ్చేసిందని నగేష్ పోలీసులకు వెల్లడించాడు.