ఆస్తుల అటాచ్‌పై జగన్ కంపెనీల వాదన సరైనదేనా?
ఆస్తుల కేసులో జగన్‌కు సంబంధించిన రూ. 749కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. వాటిలో జగన్ నివాసంతో పాటు బెంగళూరులోని వాణిజ్య సముదాయం, సాక్షి టవర్స్ కూడా ఉన్నాయి. అయితే ఈ ఆస్తుల అటాచ్‌లో ఈడీ వ్యవహారశైలిని జగన్ కంపెనీల న్యాయవాదులు తప్పుపడుతున్నారు. అందుకు వారు కారణం కూడా వివరిస్తున్నారు. జగన్ కేసులో ఈడీ సొంతంగా ఎలాంటి దర్యాప్తు చేయలేదు. కేవలం సీబీఐ వేసిన చార్జిషీట్లను తీసుకుని వాటి ఆధారంగానే ఆస్తులు అటాచ్‌చేస్తూ వచ్చింది. ఇప్పటికే […]
ఆస్తుల కేసులో జగన్‌కు సంబంధించిన రూ. 749కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. వాటిలో జగన్ నివాసంతో పాటు బెంగళూరులోని వాణిజ్య సముదాయం, సాక్షి టవర్స్ కూడా ఉన్నాయి. అయితే ఈ ఆస్తుల అటాచ్‌లో ఈడీ వ్యవహారశైలిని జగన్ కంపెనీల న్యాయవాదులు తప్పుపడుతున్నారు. అందుకు వారు కారణం కూడా వివరిస్తున్నారు. జగన్ కేసులో ఈడీ సొంతంగా ఎలాంటి దర్యాప్తు చేయలేదు. కేవలం సీబీఐ వేసిన చార్జిషీట్లను తీసుకుని వాటి ఆధారంగానే ఆస్తులు అటాచ్‌చేస్తూ వచ్చింది. ఇప్పటికే ఏడు చార్జిషీట్లలో ఇదే తరహా అటాచ్ చేసింది. అయితే ఈసారి మాత్రం సీబీఐ చార్జిషీట్లతో సంబంధం లేకుండా ఈడీ అటాచ్‌కు దిగింది. దీన్నే జగన్ తరపు న్యాయవాదులు తప్పుపడుతున్నారు. సొంతంగా దర్యాప్తు చేయని సంస్థ ఏ ప్రాతిపదికన అటాచ్ చేస్తుందని ప్రశ్నించారు. దీనిపై న్యాయపోరాటం చేస్తామంటున్నారు.
అయితే జగన్ ఆస్తుల అటాచ్‌ను మాత్రం టీడీపీ, దాని అనుకూల మీడియా మాత్రం బాగానే ఎంజాయ్ చేస్తోంది. టీడీపీ అనుకూల పత్రికలు, టీవీ చానళ్లు అటాచ్‌ను కూడా జప్తు అంటూ కథనం ప్రసారం చేయడం ఆసక్తికరంగానే ఉంది. అటాచ్ వేరు, జప్తు వేరు. విచారణలో ఉన్న ఆస్తుల క్రయవిక్రయాలు జరగకుండా నిరోధించేందుకు ఆస్తులను అటాచ్ చేస్తూ ఉంటారు. వాటి నిర్వహణ, ఇతర హక్కులు ఎప్పటిలాగే యాజమాన్యానికే ఉంటాయి.
Click on Image to Read: