ఉగ్రకుట్ర భగ్నం... కీలక ప్రాంతాలు, టెంపుల్సే టార్గెట్... ఆందోళన వద్దన్న సీపీ
హైదరాబాద్‌లో భారీ విధ్వంసానికి ఐసీస్ ఉగ్రవాదులు చేసిన కుట్రను పోలీసులు చేధించారు. పలువురు ఉగ్రవాదులను అరెస్ట్ చేసిన ఎన్‌ఐఏ అధికారులు వారి నుంచి పలు కీలక విషయాలు రాబట్టారు. పాతబస్తీ, సికింద్రాబాద్‌లోని ప్రముఖ దేవాలయాలను టార్గెట్ చేసేందుకు ఉగ్రవాదులు సిద్దమైనట్టు గుర్తించారు. పాతబస్తీలోని భాగ్యలక్ష్మి టెంపుల్‌పై ప్రధానంగా ఫోకస్ పెట్టినట్టు విచారణలో ఉగ్రవాదులు చెప్పినట్టు తెలుస్తోంది. శనివారం సాయంత్రం ఈ దాడులు చేసేందుకు వ్యూహరచన చేయగా పోలీసులు ఆ ప్రయత్నాలను సమర్థవంతంగా భగ్నం చేశారు. పోలీస్ స్టేషన్లతో […]
హైదరాబాద్‌లో భారీ విధ్వంసానికి ఐసీస్ ఉగ్రవాదులు చేసిన కుట్రను పోలీసులు చేధించారు. పలువురు ఉగ్రవాదులను అరెస్ట్ చేసిన ఎన్‌ఐఏ అధికారులు వారి నుంచి పలు కీలక విషయాలు రాబట్టారు. పాతబస్తీ, సికింద్రాబాద్‌లోని ప్రముఖ దేవాలయాలను టార్గెట్ చేసేందుకు ఉగ్రవాదులు సిద్దమైనట్టు గుర్తించారు. పాతబస్తీలోని భాగ్యలక్ష్మి టెంపుల్‌పై ప్రధానంగా ఫోకస్ పెట్టినట్టు విచారణలో ఉగ్రవాదులు చెప్పినట్టు తెలుస్తోంది. శనివారం సాయంత్రం ఈ దాడులు చేసేందుకు వ్యూహరచన చేయగా పోలీసులు ఆ ప్రయత్నాలను సమర్థవంతంగా భగ్నం చేశారు. పోలీస్ స్టేషన్లతో పాటు షాపింగ్ మాల్స్‌ను టార్గెట్ చేసినట్టు విచారణలో తేలింది. మొత్తం ఐదుగురు సభ్యుల టీం ఆపరేషన్‌లో పాల్గొనేలా వ్యూహరచన చేశారు.
ఐసిస్ సానుభూతిపరులు పెద్దఎత్తున ఆయుధాలు కొనుగోలు చేసే ప్రయత్నం చేసినట్టు ఎన్‌ఐఎ విచారణలో తేలింది. వీరికి విదేశాల నుంచి హవాలా డబ్బులు అందినట్టు గుర్తించారు. క్రూడ్ బాంబులు తయారు చేయడంలో వీరు నిపుణులని ఎన్‌ఐఎ అధికారులు అంటున్నారు. దాడుల సమయంలో ఎవరైనా దాడి చేస్తే తిరిగి అటాక్ చేసేందుకు నాందేడ్ నుంచి తుపాకులుకూడా తెచ్చుకున్నారు. నగరశివారులో ఫైరింగ్ ప్రాక్టిస్ కూడా చేశారు. అయితే హైదరాబాద్ పోలీసులు,ఎన్‌ఐఏ అధికారులు సమర్థవంతంగా వీరి కుట్రను చేధించారు.
ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హైదరాబాద్ సీపీ మహేందర్ రెడ్డి చెప్పారు. నగరంలో పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందన్నారు. పుకార్లు నమ్మవద్దని వాటిని వ్యాప్తి చేయవద్దని కోరారు. ఎవరైనా పుకార్లు వ్యాప్తి చేస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. నగరవ్యాప్తంగా పోలీసులు అప్రమత్తమయ్యారు. కీలక ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. తనిఖీలను ముమ్మరం చేశారు. కుట్ర భగ్నం అయిన నేపథ్యంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు.
Click on Image to Read: