Telugu Global
NEWS

న‌గ‌రంపై ఐసీస్ ప‌డ‌గ‌నీడ‌!

హైద‌రాబాద్‌పై అంత‌ర్జాతీయ ఉగ్ర‌వాద సంస్థ ఐఎస్ ఐఎస్ అనుబంధ సంస్థ‌ల కార్య‌క‌లాపాలు మ‌రోసారి వెలుగుచూశాయి. న‌గ‌రంలో జ‌న‌స‌మ్మ‌ర్ధ ప్రాంతాల్లో భారీ పేలుళ్ల‌కు ప‌న్నిన ఉగ్ర‌కుట్ర‌ను జాతీయ ద‌ర్యాప్తు సంస్థ (ఎన్ ఐ ఏ) భ‌గ్నం చేసింది. బుధ‌వారం ఉద‌యం న‌గ‌రంలోని పాత‌బ‌స్తీలోని ఐదు ప్రాంతాల్లో జ‌రిపిన దాడుల్లో మొత్తం 11 మంది అనుమానిత ఉగ్ర‌వాదుల‌ను అదుపులోకి తీసుకున్నారు. వీరి వ‌ద్ద నుంచి పేలుడుప‌దార్థాలు, తూటాలు, బుల్లెట్లు, తుపాకులు, రూ.15 ల‌క్ష‌ల న‌గ‌దు, పేలుడుకు వినియోగించే ర‌సాయ‌నాలను పెద్ద […]

న‌గ‌రంపై ఐసీస్ ప‌డ‌గ‌నీడ‌!
X
హైద‌రాబాద్‌పై అంత‌ర్జాతీయ ఉగ్ర‌వాద సంస్థ ఐఎస్ ఐఎస్ అనుబంధ సంస్థ‌ల కార్య‌క‌లాపాలు మ‌రోసారి వెలుగుచూశాయి. న‌గ‌రంలో జ‌న‌స‌మ్మ‌ర్ధ ప్రాంతాల్లో భారీ పేలుళ్ల‌కు ప‌న్నిన ఉగ్ర‌కుట్ర‌ను జాతీయ ద‌ర్యాప్తు సంస్థ (ఎన్ ఐ ఏ) భ‌గ్నం చేసింది. బుధ‌వారం ఉద‌యం న‌గ‌రంలోని పాత‌బ‌స్తీలోని ఐదు ప్రాంతాల్లో జ‌రిపిన దాడుల్లో మొత్తం 11 మంది అనుమానిత ఉగ్ర‌వాదుల‌ను అదుపులోకి తీసుకున్నారు. వీరి వ‌ద్ద నుంచి పేలుడుప‌దార్థాలు, తూటాలు, బుల్లెట్లు, తుపాకులు, రూ.15 ల‌క్ష‌ల న‌గ‌దు, పేలుడుకు వినియోగించే ర‌సాయ‌నాలను పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకున్నారు. దీని వెన‌క ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) సానుభూతి సంస్థ అన్సార్ ఉల్ తవ్హిద్ ఫి బిలాద్ అల్ హింద్(ఏయూటీ) కుట్ర ఉంద‌ని ఎన్ ఐ ఏ అధికారులు వెల్ల‌డించారు. వీరికి గ‌తంలో ఎలాంటి నేర‌చ‌రిత లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. వీరిలో ఇంజినీరింగ్ విద్యార్థులు, ఉన్న‌త విద్యావంతులు ఉండ‌టం పోలీసుల‌ను క‌ల‌వ‌ర పెడుతోంది. ఇప్ప‌టికే వీరు ప‌లు ప్రాంతాల్లో పేలుళ్ల‌కు పాల్ప‌డేందుకు రెక్కీలు నిర్వ‌హించిన‌ట్లు వారి వ‌ద్ద నుంచి స్వాధీనం చేసుకున్న మ్యాపుల ద్వారా తెలుస్తోంది. ఉగ్ర‌వాద సంస్థ రిక్రూట్ మెంట్ కోసం వీరు సోష‌ల్ మీడియానే ఎంచుకోవ‌డం గ‌మ‌నార్హం. ఈ కుట్ర‌కు మొత్తానికి ఏయూటీ మాడ్యూల్‌కు సౌత్ ఇండియా ఇన్‌చార్జ్‌గా భావిస్తున్న మహ్మద్ ఇబ్రహీం యజ్దానీ ని సూత్ర‌ధారిగా భావిస్తున్నారు.
అరెస్టు చేసింది వీరినే..!
మహ్మద్ ఇలియాస్ యజ్దానీ (24), మహ్మద్ ఇబ్రహీం యజ్దానీ (30), హబీబ్ మహ్మద్ (32), మహ్మద్ ఇర్ఫాన్ (27), అబ్దుల్ బిన్ అహ్మద్ అల్‌మౌదీ అలియాస్ ఫహద్ (31), సయ్యద్ నైమతుల్లా హుస్సేనీ (42), ముజఫర్ హుస్సేన్ రిజ్వాన్ (29), మహ్మద్ అతుల్లా రెహ్మాన్ (30), అల్ జిలానీ అబ్దుల్ ఖదీర్ మోసిన్ మహ్మద్ (32), ఏఎం అజర్ (20), మహ్మద్ అరబ్ అహ్మద్ (21) ఉన్నారు. అనుమానితుల‌ను హైద‌రాబాద్‌లోని ఎన్ ఐ ఏ కార్యాల‌యంలో విచారించిన అనంత‌రం.. వీరిలో సయ్యద్ నైమతుల్లా హుస్సేని అలియాస్ యాసిర్‌ నైమతుల్లా, ముజఫర్ హుస్సేన్ రిజ్వాన్ అలియాస్ రిజ్వాన్, మహ్మద్ అతుల్లా రహమాన్, అబ్దుల్ అలియాస్ అల్ జిలానీ అబ్దుర్ ఖాదర్ మొహిసిన్ మహమూద్, ఏఎం అజహర్, మహ్మద్ అర్బాజ్ అహ్మద్ మొత్తం ఆరుగురిని విడిచి పెట్టారు.
First Published:  30 Jun 2016 3:38 AM IST
Next Story