చంద్రబాబు పాలనపై NCAER షాకింగ్ రిపోర్ట్
నేషనల్ కౌన్సిల్ ఫర్ అప్లయిడ్ ఎకనామిక్ రిసెర్చ్ (NCAER) నిర్వహించిన సర్వేలో పలు షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆంధ్రప్రదేశ్‌లో పాలన గురించి పారిశ్రామికవర్గాలు ఏమంటున్నాయన్న విషయాన్ని సర్వే రిపోర్టు బట్టబయలు చేసింది. పెట్టుబడుల విషయంలో కాకుండా అవినీతి విషయంలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది. 74. 3 శాతం మంది ఆంధ్రప్రదేశ్‌లో అవినీతి చాలా భయంకరమైన సమస్యగా ఉందని వెల్లడించారు. అనుమతులు రావాలంటే లంచాలు ఇచ్చుకోవాల్సిందేనని వాపోయారు. మరో 17 శాతం మంది కరెప్షన్ ఒక మాదిరిగా […]
నేషనల్ కౌన్సిల్ ఫర్ అప్లయిడ్ ఎకనామిక్ రిసెర్చ్ (NCAER) నిర్వహించిన సర్వేలో పలు షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆంధ్రప్రదేశ్‌లో పాలన గురించి పారిశ్రామికవర్గాలు ఏమంటున్నాయన్న విషయాన్ని సర్వే రిపోర్టు బట్టబయలు చేసింది. పెట్టుబడుల విషయంలో కాకుండా అవినీతి విషయంలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది. 74. 3 శాతం మంది ఆంధ్రప్రదేశ్‌లో అవినీతి చాలా భయంకరమైన సమస్యగా ఉందని వెల్లడించారు. అనుమతులు రావాలంటే లంచాలు ఇచ్చుకోవాల్సిందేనని వాపోయారు. మరో 17 శాతం మంది కరెప్షన్ ఒక మాదిరిగా ఉందని చెప్పారు.
ఏపీ తర్వాతి స్థానంలో తమిళనాడు ఉంది. ఇక్కడ 71.8 శాతం మంది అవినీతి భయంకరంగా ఉందని అభిప్రాయపడ్డారు. అయితే పెట్టుబడులకు అనువైన రాష్ట్రాల జాబితాలో తమిళనాడు మూడో స్థానంలో నిలవడం గమనార్హం. కేజ్రివాల్ పాలనలో ఉన్న ఢిల్లీలో పరిశ్రమల ఏర్పాటుకు లంచాలు ఇవ్వాల్సిన పనిలేదని తేలింది. పెట్టుబడులకు అత్యంత అనువైన రాష్ట్రంగా ఢిల్లీని గుర్తించారు. ఆ తర్వాతి స్థానంలో గుజరాత్ ఉంది. పెట్టుబడులకు అనువైన రాష్ట్రాల జాబితాలో టాప్ 5లో ఏపీకి స్థానం దక్కలేదు.
తెలంగాణలో భూమి సమస్య లేదని ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు. పశ్చిమబెంగాల్‌లో మాత్రం పరిశ్రమలు స్థాపించాలంటే భూమి సమస్య తీవ్రంగా ఉందని అభిప్రాయపడ్డారు. బీహార్, జార్ఖండ్ పెట్టుబడులు పెట్టేందుకు అనువైన రాష్ట్రాలు కాదని నివేదిక చెబుతోంది. మొత్తం మీద NCAER నివేదిక చంద్రబాబుకు పెద్ద ఎదురుదెబ్బే. సింగిల్ విండో, మూడు వారాల్లో అనుమతులు అంటూ ప్రచారం చేసుకుంటున్న చంద్రబాబు ఈ నివేదిక తర్వాత ఎలా ముందుకు వెళ్తారో!. 2050నాటికి ప్రపంచంలో నెంబర్ వన్ రాష్ట్రం చేస్తానన్న చంద్రబాబు రెండేళ్లలోనే అవినీతిలో నెంబర్ వన్ చేశారన్న విమర్శలు ఉధృతం అయ్యే చాన్స్ ఉంది.
Click on Image to Read: