జగన్ కదా!... జడలు విప్పింది
ఈనాడు పత్రిక. విశ్వసనీయతకు మారుపేరు అని దాన్ని ఇష్టపడే వారు చెప్పుకుంటుంటారు. రామోజీ కూడా అందుకు తగ్గట్టే హావభావాలు ప్రదర్శిస్తుంటారు. అయితే జగన్ విషయం వచ్చేసరికి మాత్రం ఈనాడుకు విశ్వసనీయత, నిజాయితీ అన్నవి తీసి గట్టునపెట్టి కలంతో కదంతొక్కుతుంటారు. టీడీపీకి అనుకూలంగానే ఇంకో పత్రిక కూడా ఉంది. దాని గురించి పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. జగన్ గురించి ఏ చిన్న వ్యతిరేక వార్త దొరికినా దానికి బీభత్సమైన పబ్లిసిటీ ఇచ్చి ఆనందడోలికల్లో ఊగుతుంటుంది. తాజాగా జగన్‌కు సంబంధించిన […]
ఈనాడు పత్రిక. విశ్వసనీయతకు మారుపేరు అని దాన్ని ఇష్టపడే వారు చెప్పుకుంటుంటారు. రామోజీ కూడా అందుకు తగ్గట్టే హావభావాలు ప్రదర్శిస్తుంటారు. అయితే జగన్ విషయం వచ్చేసరికి మాత్రం ఈనాడుకు విశ్వసనీయత, నిజాయితీ అన్నవి తీసి గట్టునపెట్టి కలంతో కదంతొక్కుతుంటారు. టీడీపీకి అనుకూలంగానే ఇంకో పత్రిక కూడా ఉంది. దాని గురించి పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. జగన్ గురించి ఏ చిన్న వ్యతిరేక వార్త దొరికినా దానికి బీభత్సమైన పబ్లిసిటీ ఇచ్చి ఆనందడోలికల్లో ఊగుతుంటుంది. తాజాగా జగన్‌కు సంబంధించిన ఆస్తులను ఈడీ అటాచ్ చేయగా… ఈ రెండు పత్రికలు తెల్లవారే సరికి పతాక శీర్షికలతో చిందేశాయి. అయితే ఎంతో పేరున్న ఈనాడుకు తన పాఠకుల మీద, జనం మీద ఎంత చిన్నచూపు ఉందో మరోసారి నిరూపించుకుంది.
జనాన్ని మూర్ఖత్వంలోనే ఉంచేందుకు తాపత్రయపడింది ఈనాడు. జగన్ ఆస్తులను అటాచ్ చేస్తే ఈనాడు మాత్రం ఏకంగా జప్తు అని రాసేసింది. అది కూడా మొదటిపేజీలో కావాలనే. ఎంత దారుణం?. నీతులు చెప్పే మీడియా మొగల్‌కు అటాచ్‌కు జప్తుకు తేడా తెలియదా?. తెలియదని అనుకుంటే అది భ్రమే. మేధావుల పత్రికకు అన్నీ తెలుసు. కానీ కావాలనే జనాన్ని తప్పుదోవ పట్టించి వీలైనంత వరకు టీడీపీకి మంచిచేసే ప్రయత్నం అది. ఈనాడుకు ఇది ఈనాడు ఉన్న అలవాటు కాదు. పురిటిలోనే పుట్టిన వైకల్యం.
ఇక బాబుగారి లీకు పత్రిక జగన్ ఆస్తుల అటాచ్ వివరాల పట్టిక వేసింది. జగన్ విషయం కదా జర్నలిజం జడలు విప్పి ఆలోచించింది. అందుకే పట్టికలో అంకెలను తెలివిగా లక్షల్లో ముద్రేసింది. జగన్ ఫలాన ఆస్తి విలువ 4954… మరో ఆస్తి విలువ 3184… ఇంటి విలువ 5689 అంటూ పెద్ద పట్టికను అచ్చేసింది. ఈ పట్టికను జాగ్రత్తగా గమనించకపోతే అవన్ని కోట్లలాగా కనిపిస్తాయి. అలా కనిపించాలనే సదరు పత్రిక ఇలాంటి ఎత్తులు వేస్తుంది. ఇంతగా భారీ అంకెలు చూపించి పైన ఒక మూల మాత్రం వివరాలు లక్షల్లో అంటూ ప్రకటించింది. ఏ పత్రికైనా 5689 లక్షలు, 4954 లక్షలు, 3184 లక్షలు అని రాస్తాయా?. తమ పాఠకులను తికమకపెట్టాలని ఏ పత్రికా అనుకోదు. 56 కోట్ల 89 లక్షలు, 49కోట్ల 54 లక్షలు అంటూ సింపుల్‌గా రాస్తాయి. కానీ బాబు పత్రిక మాత్రం జగన్ ఆస్తులను ఎట్టిపరిస్థితుల్లోనూ వేల కోట్లలోనే చూపించాలని తాపత్రయపడుతోంది. అందుకే ఇలా తక్కువ కోట్లను లక్షల్లోకి మార్చి భారీ మొత్తంగా చూపించే ప్రయత్నం చేసింది. ఈ తెలివితేటలు తన మీడియాకు లేకపోవడం జగన్ దురదృష్టం.
Click on Image to Read: