జగన్ నివాసం అటాచ్
జగన్ ఆస్తుల కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ జగన్‌కు సంబంధించిన ఆస్తులను తాజాగా అటాచ్ చేసింది. మొత్తం 749కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది.అయితే ఇది తాత్కాలిక అటాచ్‌మెంట్ మాత్రమేనని ఈడీ తెలిపింది. తాత్కాలికంగా అటాచ్ అయిన వాటిలో లోటస్‌పాండ్‌లోని జగన్ నివాసం, సాక్షి టవర్స్, బెంగళూరులోని ఒక వాణిజ్యసముదాయం ఉంది. జగన్, భారతిలకు సంబంధించిన పలు కంపెనీల షేర్లను కూడా అటాచ్ చేసింది ఈడీ. అయితే ఇది తాత్కాలిక అటాచ్ మాత్రమే కావడం వల్ల భవనాలను యథావిథిగానే […]
జగన్ ఆస్తుల కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ జగన్‌కు సంబంధించిన ఆస్తులను తాజాగా అటాచ్ చేసింది. మొత్తం 749కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది.అయితే ఇది తాత్కాలిక అటాచ్‌మెంట్ మాత్రమేనని ఈడీ తెలిపింది. తాత్కాలికంగా అటాచ్ అయిన వాటిలో లోటస్‌పాండ్‌లోని జగన్ నివాసం, సాక్షి టవర్స్, బెంగళూరులోని ఒక వాణిజ్యసముదాయం ఉంది. జగన్, భారతిలకు సంబంధించిన పలు కంపెనీల షేర్లను కూడా అటాచ్ చేసింది ఈడీ. అయితే ఇది తాత్కాలిక అటాచ్ మాత్రమే కావడం వల్ల భవనాలను యథావిథిగానే జగన్ కుటుంబం, ఆయన కార్యాయాలు వాడుకోవచ్చని చెబుతున్నారు. ఇది వరకే కొన్ని ఆస్తులను ఈడీ జప్తు చేసినా వాటినిర్వహణ మొత్తం జగన్ ఆధీనంలోనే ఉంది.
Click on Image to Read: