సోమరిపోతులయ్యారు... అన్నీ ఎత్తివేయాలి
ఏపీ బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు వివాదాస్పదవ్యాఖ్యలు చేశారు. ఉపాథి హామీ పథకంవల్ల పల్లెజనం సోమరిపోతుల్లా తయారయ్యారని విమర్శించారు. వెంటనే ఉపాధిహామీ పథకాన్ని ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. విశాఖపట్నం కలెక్టరేట్‌లో జరిగిన వ్యవసాయ, దాని అనుబంధ శాఖల అధికారులతో మంగళవారం వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలోనే విష్ణుకుమార్ రాజు ఈ వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు.. గ్రామాల్లో ఏదైనా పనికి మనుషులు కావాలంటే ఎవరూ ముందుకు రావడం లేదని, అంతా […]
ఏపీ బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు వివాదాస్పదవ్యాఖ్యలు చేశారు. ఉపాథి హామీ పథకంవల్ల పల్లెజనం సోమరిపోతుల్లా తయారయ్యారని విమర్శించారు. వెంటనే ఉపాధిహామీ పథకాన్ని ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. విశాఖపట్నం కలెక్టరేట్‌లో జరిగిన వ్యవసాయ, దాని అనుబంధ శాఖల అధికారులతో మంగళవారం వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలోనే విష్ణుకుమార్ రాజు ఈ వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు.. గ్రామాల్లో ఏదైనా పనికి మనుషులు కావాలంటే ఎవరూ ముందుకు రావడం లేదని, అంతా ఉపాధి పనులకు పోతున్నారన్నారు. దాంతో మిగిలిన పనులకు ఆటంకం కలుగుతోందన్నారు. రూపాయికి కిలో బియ్యం, ఇతర సరుకులు సబ్సిడీపై ఇవ్వడం, ఉచిత పథకాలు అమలు చేయడం వల్ల ప్రజల్లో బద్దకం పెరిగిపోయి పనికి మాలినోళ్లుగా తయారయ్యారని తెలిపారు. ఉచిత పథకాలను నిలుపుదల చేయాలని మంత్రిని విష్ణుకుమార్ రాజు కోరారు.
Click on Image to Read: