హైకోర్టు విభజనలో జాప్యం ఎవరిది?
తెలంగాణ – ఏపీల ఉమ్మడి హైకోర్టు విభజన వివాదం రోజురోజుకు ముదురుతోంది. తెలంగాణకు ఏపీ న్యాయవాదుల కేటాయింపులను నిరసిస్తూ తెలంగాణ న్యాయాధికారులు ఆందోళనకు దిగడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. తాజాగా మరో 9 మంది న్యాయాధికారులను సస్పెండ్ చేయడంతో వివాదం పెరిగి పెద్దదైంది. దీనికితోడు సీఎం కేసీఆర్ కూడా కేంద్రం తీరును తప్పుబట్టడం, దానికి మాకేం సంబంధం అని కేంద్రం సమాధానమివ్వడంతో హైకోర్టు విభజనను ఏపీ సీఎం చంద్రబాబే ఆపుతున్నారని తెలంగాణ వాదులు మండిపడుతున్నారు. ఏపీకి ప్రత్యేక హైకోర్టు […]
BY sarvi29 Jun 2016 1:50 AM IST
X
sarvi Updated On: 29 Jun 2016 7:31 AM IST
తెలంగాణ – ఏపీల ఉమ్మడి హైకోర్టు విభజన వివాదం రోజురోజుకు ముదురుతోంది. తెలంగాణకు ఏపీ న్యాయవాదుల కేటాయింపులను నిరసిస్తూ తెలంగాణ న్యాయాధికారులు ఆందోళనకు దిగడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. తాజాగా మరో 9 మంది న్యాయాధికారులను సస్పెండ్ చేయడంతో వివాదం పెరిగి పెద్దదైంది. దీనికితోడు సీఎం కేసీఆర్ కూడా కేంద్రం తీరును తప్పుబట్టడం, దానికి మాకేం సంబంధం అని కేంద్రం సమాధానమివ్వడంతో హైకోర్టు విభజనను ఏపీ సీఎం చంద్రబాబే ఆపుతున్నారని తెలంగాణ వాదులు మండిపడుతున్నారు.
ఏపీకి ప్రత్యేక హైకోర్టు కేటాయించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ ఎప్పటి నుంచో కోరుతున్నారు. కావాలంటే.. మీరు అదే భవనంలో ఉండండి.. మేము మరో భవనంలోకి మారుతాం. లేదా మీకు నచ్చినచోట భవనం, మౌలిక సదుపాయాలు కల్పించేందుకు మేం సిద్ధమని పలుమార్లు ఏపీనికోరారు. అయినా, అటు నుంచి ఎలాంటి స్పందన రావడం లేదు. దీనికితోడు ఇటీవల జరిగిన న్యాయాధికారుల కేటాయింపులో తెలంగాణకు 20 మంది న్యాయాధికారులను కేటాయించగా.. అందులో కేవలం ముగ్గురు మాత్రమే తెలంగాణ వారు ఉన్నారు. దీంతో ఈ వివాదం ఆందోళనగా రూపాంతరం చెందింది. దీనిపై నిరసన తెలిపిన న్యాయాధికారులపై హైకోర్టు సస్పెన్షన్ వేటు వేయగా ఆ సంఖ్య మంగళవారంతో 11కు చేరింది.
వాస్తవానికి కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానంద గౌడ హైకోర్టు విభజనకు కేంద్రానికి సంబంధం లేదని ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేశారు. తాజాగా మరోసారి ఇదే విషయాన్ని తేల్చి చెప్పారు. ఈ విషయంలో ఇద్దరు సీఎంలదే బాధ్యత అని.. వారిద్దరూ కూర్చుని మాట్లాడుకోవాలని హితవు పలికారు. మరోవైపు రెండేళ్లుగా హైకోర్టు విభజన విషయంలో.. చంద్రబాబు ఎలాంటి మాటా మాట్లాడటం లేదు. తెలంగాణ న్యాయాధికారుల ఆందోళనకు తెలంగాణ సర్కారు సంపూర్ణ మద్దతు తెలిపింది. హైకోర్టు విభజనపై వీలైనంత త్వరగా చర్యలు తీసుకోవాలని.. మంగళవారం రాత్రి సీఎం కేసీఆర్ కేంద్ర హోంశాఖకు లేఖ కూడా రాశారు. నేడు కీలకమంత్రులతో భేటీ నిర్వహించిన అనంతరం ఢిల్లీలో సీఎం ధర్నా చేయడంపై ఓ నిర్ణయానికి రానున్నారు.
Next Story