Telugu Global
Cinema & Entertainment

చిరు సినిమాలో మెరుపు వీరులు

చిరంజీవి 150వ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇటీవలే ప్రారంభమైన విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో పలువురు మెగా హీరోలు కూడా నటించనున్నారనే విషయం కూడా తెలిసిందే. సాయిధర్మతేజ,వరుణ్ తేజ, బన్నీ వీళ్లలో ఇద్దరు చిరు 150వ సినిమాలో కనిపిస్తారని తెలుస్తోంది. ఇప్పుడీ జాబితా మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం… చిరు 150వ సినిమాలో సమంత కూడా మెరవబోతోందట. అవును… సినిమాలో ఓ చిన్న పాత్రలో సమంత కనిపిస్తుందని తెలుస్తోంది. మరోవైపు ఇదే […]

చిరు సినిమాలో మెరుపు వీరులు
X
చిరంజీవి 150వ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇటీవలే ప్రారంభమైన విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో పలువురు మెగా హీరోలు కూడా నటించనున్నారనే విషయం కూడా తెలిసిందే. సాయిధర్మతేజ,వరుణ్ తేజ, బన్నీ వీళ్లలో ఇద్దరు చిరు 150వ సినిమాలో కనిపిస్తారని తెలుస్తోంది. ఇప్పుడీ జాబితా మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.
తాజా సమాచారం ప్రకారం… చిరు 150వ సినిమాలో సమంత కూడా మెరవబోతోందట. అవును… సినిమాలో ఓ చిన్న పాత్రలో సమంత కనిపిస్తుందని తెలుస్తోంది. మరోవైపు ఇదే సినిమాలో నాగార్జున కూడా మెరవబోతున్నాడట. చిరు-నాగార్జున మధ్య మంచి రిలేషన్స్ ఉన్నాయి. ఇద్దరూ బయట బిజినెస్ పార్ట్ నర్స్ కూడా. ఆ చనువు కొద్దీ చిరు 150వ సినిమాలో నాగార్జున కూడా కనిపిస్తాడనే ప్రచారం సాగుతోంది. ఇన్ని గెస్ట్ రోల్స్ పెడితే… చిరంజీవి ఎలా ఎలివేట్ అవుతారనేది పెద్ద ప్రశ్న.
సరే… ఈ విషయం అటుంచితే… చిరంజీవి 150వ సినిమాలో హీరోయిన్ ఎవరనే అంశంపై ఇంకా చర్చలు నడుస్తూనే ఉన్నాయి. ఇప్పటికే జాబితాలో ఉన్న దీపికా పదుకోన్, సోనాక్షి సిన్హా, అనుష్క, నయనతార లాంటి పేర్లకు తోడు ఇప్పుడు తాజాగా మరో బాలీవుడ్ బ్యూటీ వచ్చి చేరింది. చిరు 150వ సినిమాలో నర్గీస్ ఫక్రి నటించే అవకాశాలున్నాయంటున్నారు. దీనిపై త్వరలోనే ఓ క్లారిటీ రానుంది.
First Published:  29 Jun 2016 2:40 AM IST
Next Story