ఎగిరిపడ్డ పూలదండ " బాలయ్య కారుకు ప్రమాదం
హీరో, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. డివైడర్‌ను ఢీకొట్టడంతో కారు దెబ్బతింది. బాలకృష్ణ మాత్రం క్షేమంగా బయపడ్డారు. హిందూపురం నుంచి బెంగళూరు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. కారు వేగంగా వెళ్తున్న సమయంలో అభిమానులు కారు మీద వేసిన పూలదండ ఒకటి అద్దాలపైకి ఎగిరిపడ్డట్టు చెబుతున్నారు. దీంతో దారి కనిపించక ఒక్కసారిగా డ్రైవర్ కారును అదుపు చేయలేకపోయారు. కారు వేగంగా డివైడర్‌ను ఢీకొట్టడంతో కారు దెబ్బతింది. ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు. అనంతరం […]

హీరో, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. డివైడర్‌ను ఢీకొట్టడంతో కారు దెబ్బతింది. బాలకృష్ణ మాత్రం క్షేమంగా బయపడ్డారు. హిందూపురం నుంచి బెంగళూరు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. కారు వేగంగా వెళ్తున్న సమయంలో అభిమానులు కారు మీద వేసిన పూలదండ ఒకటి అద్దాలపైకి ఎగిరిపడ్డట్టు చెబుతున్నారు. దీంతో దారి కనిపించక ఒక్కసారిగా డ్రైవర్ కారును అదుపు చేయలేకపోయారు. కారు వేగంగా డివైడర్‌ను ఢీకొట్టడంతో కారు దెబ్బతింది. ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు. అనంతరం బాలకృష్ణ మరో కారులో బెంగళూరు వెళ్లిపోయారు.
Click on Image to Read: