Telugu Global
Cinema & Entertainment

కబాలి ఆడియోకు రజనీ ఎందుకు రాలేదు ?

సూపర్ స్టార్ రజనీకాంత్ రాకుండానే కబాలి ఆడియో ఫంక్షన్ జరిగిపోయింది. కేవలం తెలుగులో మాత్రమే కాదు… తమిళ ఆడియో కూడా తళైవ లేకుండానే జరిగిపోయింది. కానీ రజనీకాంత్ జాడ మాత్రం లేదు.ఇంకా చెప్పాలంటే రజనీ అసలు ఇండియాలోనే లేడు. ప్రస్తుతం అమెరికాలో ఉన్నాడని అంతా అంటున్నారు. దీంతో సూపర్ స్టార్ ఆరోగ్యం సరిగా లేదంటూ మరోసారి పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇటీవల కబాలి షూటింగ్ నుంచి బ్రేక్ తీసుకోవడంతో రజినీకాంత్ ఫ్యామిలీతో కలిసి… అమెరికా టూర్ కు […]

కబాలి ఆడియోకు రజనీ ఎందుకు రాలేదు ?
X

సూపర్ స్టార్ రజనీకాంత్ రాకుండానే కబాలి ఆడియో ఫంక్షన్ జరిగిపోయింది. కేవలం తెలుగులో మాత్రమే కాదు… తమిళ ఆడియో కూడా తళైవ లేకుండానే జరిగిపోయింది. కానీ రజనీకాంత్ జాడ మాత్రం లేదు.ఇంకా చెప్పాలంటే రజనీ అసలు ఇండియాలోనే లేడు. ప్రస్తుతం అమెరికాలో ఉన్నాడని అంతా అంటున్నారు. దీంతో సూపర్ స్టార్ ఆరోగ్యం సరిగా లేదంటూ మరోసారి పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

ఇటీవల కబాలి షూటింగ్ నుంచి బ్రేక్ తీసుకోవడంతో రజినీకాంత్ ఫ్యామిలీతో కలిసి… అమెరికా టూర్ కు వెళ్లారు. అక్కడ తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో రజనీని ఐసీయూలో చేర్పించారని కొన్నిరోజుల క్రితం వార్తలు వినిపించాయి. అయితే, రజినీ ఫ్యామిలీ మెంబర్స్, ‘కబాలి’ యూనిట్ ఆ వార్తలను తీవ్రంగా ఖండించింది. పైగా అమెరికాలో రజనీకాంత్ తో దిగిన ఓ సెల్ఫీని అతని కూతురు విడుదల చేసింది కూడా. దీంతో అప్పట్లో ఆ రూమర్లు కాస్త తగ్గాయి. అయితే తాజాగా మరోసారి రజనీ ఆరోగ్య పరిస్థితిపై వార్తలు వస్తున్నాయి.

తమిళ మీడియాలో వినిపిస్తున్న వార్తల ప్రకారం.. రజనీ ఆరోగ్యంపై వస్తున్న రూమర్స్ నిజమేనని తెలుస్తోంది. ఆ రూమర్స్ ఏమిటంటే.. రజినీకాంత్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారని, దాని చికిత్స కోసమే ఆయన అమెరికా వెళ్లారని ప్రచారం జరుగుతుంది. ఇక్కడ మరో షాకింగ్ రూమర్ ఏమిటంటే.. రజనీకాంత్ కు అమెరికాలోని ఓ హాస్పిటల్ లో కిడ్నీ మార్పిడి ఆపరేషన్ జరగబోతుందట. ఈ ఆపరేషన్ పనిమీదే రజినీ ఫ్యామిలీ అమెరికా వెళ్లిందని వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో రజనీకాంత్ అభిమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

First Published:  28 Jun 2016 4:03 AM IST
Next Story