Telugu Global
Cinema & Entertainment

త్రివిక్రమ్ చేతి ఖర్చుల విలువ రూ.15 లక్షలు

ఎవరైనా చేతిఖర్చులకు వెయ్యో.. 2వేలో పెట్టుకుంటారు. మహా మహా స్టార్లు అయితే లక్ష రూపాయలు కూడా పెట్టుకుంటారు. కానీ త్రివిక్రమ్ మాత్రం తన రోజువారీ ఖర్చుల కోసం నెలకు 15లక్షల రూపాయలు వాడుతున్నాడట. అది కూడా తన జేబులోంచి కాదు. ఓ నిర్మాత జేబు లాంటి ఆ ఖర్చులు వసూలు చేస్తున్నాడట. త్రివిక్రమ్ వరుసగా తన సినిమాలను నిర్మాత ఎస్. రాధాకృష్ణ నిర్మాణ సారథ్యంలో హారిక అండ్ హాసిని సినీ క్రియేషన్స్ బ్యానర్ పైనే చేస్తుండటం ఫిల్మ్ […]

త్రివిక్రమ్ చేతి ఖర్చుల విలువ రూ.15 లక్షలు
X
ఎవరైనా చేతిఖర్చులకు వెయ్యో.. 2వేలో పెట్టుకుంటారు. మహా మహా స్టార్లు అయితే లక్ష రూపాయలు కూడా పెట్టుకుంటారు. కానీ త్రివిక్రమ్ మాత్రం తన రోజువారీ ఖర్చుల కోసం నెలకు 15లక్షల రూపాయలు వాడుతున్నాడట. అది కూడా తన జేబులోంచి కాదు. ఓ నిర్మాత జేబు లాంటి ఆ ఖర్చులు వసూలు చేస్తున్నాడట.
త్రివిక్రమ్ వరుసగా తన సినిమాలను నిర్మాత ఎస్. రాధాకృష్ణ నిర్మాణ సారథ్యంలో హారిక అండ్ హాసిని సినీ క్రియేషన్స్ బ్యానర్ పైనే చేస్తుండటం ఫిల్మ్ సర్కిల్ లో ఇంట్రెస్టింగ్ టాపిక్ గా మారింది. దీనిపై లోతుగా వెళితే ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఆ వార్తలు ఏమిటంటే.. ‘అ.. ఆ’ సినిమా కోసమో… లేక పర్మినెంట్ గానో తెలియదు గాని హారిక అండ్ హాసిని బ్యానర్ కు త్రివిక్రమ్ కు మధ్య ఓ ఒప్పందం కుదిరిందట. ఆ ఒప్పందం ప్రకారం త్రివిక్రమ్ ఖర్చులకు నెలకు 15 లక్షల రూపాయలు ఇవ్వాలట. ఇక ఈ మొత్తంతో పాటు ఓ సినిమాకు త్రివిక్రమ్ కు 10 కోట్లు ఇవ్వాలట. దీంతో మొత్తానికి ఓ సినిమా పేరు చెప్పి ఏడాదికి సదరు నిర్మాత నుంచి త్రివిక్రమ్ కు దాదాపు 12 కోట్లు ముడుతుందని సినీ వర్గాల్లో పుకార్లు వినిపిస్తున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియదు గాని.. సూపర్ హిట్స్ ఇచ్చే మాటల మాంత్రికుడి రేంజ్ ఆ మాత్రం ఉంటుందని సినీ లవర్స్ భావిస్తున్నారు.
First Published:  28 Jun 2016 4:35 AM IST
Next Story