ఊబర్ కంపెనీ మహిళా ట్యాక్సీ డ్రైవర్ ఆత్మహత్య...ఆమె స్వస్థలం ఆంధ్ర!
ఊబర్ కంపెనీకి చెందిన మహిళా ట్యాక్సీ డ్రైవర్ భారతీ వీరత్ (39) బెంగలూరులో ఆత్మహత్యకు పాల్పడింది. రెండేళ్లక్రితం ఆమె ఊబర్లో ట్యాక్సీ డ్రైవర్గా చేరినపుడు ఆమె గురించి విస్తృతంగా వార్తలు వచ్చాయి. ధైర్యవంతురాలైన మహిళగా గుర్తింపు పొందిన భారతి అర్థంతరంగా ఆత్మహత్యతో జీవితాన్ని ముగించడాన్ని ఆమెని గురించి తెలిసి ఉన్నవారు జీర్ణించుకోలేకపోతున్నారు. భారతి నడుపుతున్న ఫార్డ్ ఫీస్టా ట్యాక్సీ ఆమె ఇంటికి దగ్గరలో ఉంది. ఆమె డబ్బు కూడబెట్టుకుని దాన్ని సొంతం చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నట్టుగా […]
ఊబర్ కంపెనీకి చెందిన మహిళా ట్యాక్సీ డ్రైవర్ భారతీ వీరత్ (39) బెంగలూరులో ఆత్మహత్యకు పాల్పడింది. రెండేళ్లక్రితం ఆమె ఊబర్లో ట్యాక్సీ డ్రైవర్గా చేరినపుడు ఆమె గురించి విస్తృతంగా వార్తలు వచ్చాయి. ధైర్యవంతురాలైన మహిళగా గుర్తింపు పొందిన భారతి అర్థంతరంగా ఆత్మహత్యతో జీవితాన్ని ముగించడాన్ని ఆమెని గురించి తెలిసి ఉన్నవారు జీర్ణించుకోలేకపోతున్నారు. భారతి నడుపుతున్న ఫార్డ్ ఫీస్టా ట్యాక్సీ ఆమె ఇంటికి దగ్గరలో ఉంది. ఆమె డబ్బు కూడబెట్టుకుని దాన్ని సొంతం చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నట్టుగా తెలుస్తోంది.
భారతి స్వస్థలం ఆంధ్రప్రదేశ్ కాగా పదేళ్ల క్రితం బెంగలూరులో స్థిరపడినట్టుగా స్థానిక మీడియా పేర్కొంది. తిరిగి ఆంధ్రకు వెళ్లిపోతానని తనతో చెప్పినట్టుగా ఆమె ఇంటి ఓనరు తెలిపాడు. ఆదివారం రాత్రి ఇంట్లోకి వెళ్లిన భారతి, సోమవారం రాత్రి వరకు బయట కనిపించకపోవటంతో ఆమె ఉంటున్న మూడవ ఫ్లోర్కి వెళ్లిన ఇంటి యజమానికి… కిటికీలోంచి ఆమె ఉరివేసుకుని ఉన్న దృశ్యం కనిపించింది. అతను పోలీసులకు సమాచారం అందించాడు.
భారతి తమకున్న మహిళా డ్రైవర్ పాట్నర్స్లో చాలా సానుకూల దృక్పథం ఉన్న వ్యక్తి అని, ఆమె చాలామంది మహిళా డ్రైవర్లకు స్ఫూర్తిగా నిలిచారని ఊబర్ కంపెనీ తన ప్రకటనలో పేర్కొంది. భారతి ఒంటరిగా నివసిస్తోంది. ఆమె మరణానికి కారణం తెలియరాలేదు.