ఫిరాయింపు ఎమ్మెల్యే భవనం కూల్చివేతకు ఆదేశం
టీడీపీ నుంచి అధికార టీఆర్‌ఎస్‌లోకి ఫిరాయించినప్పటికీ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానందకు చిక్కులు తప్పలేదు. అధికార పార్టీ అండతో అక్రమకట్టడాన్ని కాపాడుకునేందుకు ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించడం లేదు. నిబంధనలకు విరుద్దంగా కట్టిన ఎమ్మెల్యే భవనాన్ని కూల్చివేయాల్సిందిగా హైకోర్టు ఆదేశించింది. ఇది వరకు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ సమర్ధించింది. రంగారెడ్డి జిల్లా కుత్బుల్లాపూర్ గ్రామంలో జి+1 నిర్మాణానికి అనుమతి తీసుకున్న ఎమ్మెల్యే వివేకా ఏకంగా నాలుగు అంతస్తుల భారీ వాణిజ్యభవనం కట్టేశారు. దీనిపై అధికారులు […]
టీడీపీ నుంచి అధికార టీఆర్‌ఎస్‌లోకి ఫిరాయించినప్పటికీ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానందకు చిక్కులు తప్పలేదు. అధికార పార్టీ అండతో అక్రమకట్టడాన్ని కాపాడుకునేందుకు ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించడం లేదు. నిబంధనలకు విరుద్దంగా కట్టిన ఎమ్మెల్యే భవనాన్ని కూల్చివేయాల్సిందిగా హైకోర్టు ఆదేశించింది. ఇది వరకు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ సమర్ధించింది.
రంగారెడ్డి జిల్లా కుత్బుల్లాపూర్ గ్రామంలో జి+1 నిర్మాణానికి అనుమతి తీసుకున్న ఎమ్మెల్యే వివేకా ఏకంగా నాలుగు అంతస్తుల భారీ వాణిజ్యభవనం కట్టేశారు. దీనిపై అధికారులు చర్యలు తీసుకోవడం లేదంటూ ఎమ్మెల్యే బంధువు కేఎం ప్రతాప్ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై సుదీర్ఘ విచారణ చేపట్టిన సింగిల్ జడ్జి జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి.. వాటిని అక్రమ కట్టడాలుగా పేర్కొంటూ కూల్చేయాలని తీర్పు ఇచ్చారు. ఈ తీర్పును సవాల్‌చేస్తూ వివేకానందతో పాటు ఆ భవనంలో ఉన్న నారాయణ కాలేజీ యాజమాన్యం కూడా అప్పిల్ చేసింది. దీనిపై విచారణ జరిపిన డివిజన్ బెంచ్ కూడా సింగిల్ జడ్జి తీర్పునే సమర్థిస్తూ.. భవనాలను కూల్చేయాలని ఆదేశాలు ఇచ్చింది.
Click on Image to Read: