Telugu Global
NEWS

జగన్‌ను చూసి నేర్చుకోవాలి...

తెలంగాణలో ప్రస్తుతం కేసీఆర్‌ సీజన్ నడుస్తోందని త్వరలోనే ఆ సీజన్‌ ముగుస్తుందని టీకాంగ్రెస్ శాసనమండలిపక్ష నేత షబ్బీర్ అలీ అన్నారు. ఎండకాలంలో చెరువులు ఖాళీ అవడం తిరిగి వర్షకాలంలో నీరు చేరడం సర్వసాధారణమేనని అన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్‌ నుంచి వలసలు కూడా అలాంటివేనన్నారు. ఒక టీవీ ఛానల్‌తో ప్రత్యేకంగా మాట్లాడిన షబ్బీర్ అలీ… మరో ఏడాది గడిస్తే ఇతరపార్టీల నేతలే కాంగ్రెస్‌లోకి వస్తారన్నారు. రెండేళ్లలో 47మంది ప్రజాప్రతినిధులు ఫిరాయించేలా చేసిన ఘనత ఒక్క కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. తమ […]

జగన్‌ను చూసి నేర్చుకోవాలి...
X

తెలంగాణలో ప్రస్తుతం కేసీఆర్‌ సీజన్ నడుస్తోందని త్వరలోనే ఆ సీజన్‌ ముగుస్తుందని టీకాంగ్రెస్ శాసనమండలిపక్ష నేత షబ్బీర్ అలీ అన్నారు. ఎండకాలంలో చెరువులు ఖాళీ అవడం తిరిగి వర్షకాలంలో నీరు చేరడం సర్వసాధారణమేనని అన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్‌ నుంచి వలసలు కూడా అలాంటివేనన్నారు. ఒక టీవీ ఛానల్‌తో ప్రత్యేకంగా మాట్లాడిన షబ్బీర్ అలీ… మరో ఏడాది గడిస్తే ఇతరపార్టీల నేతలే కాంగ్రెస్‌లోకి వస్తారన్నారు. రెండేళ్లలో 47మంది ప్రజాప్రతినిధులు ఫిరాయించేలా చేసిన ఘనత ఒక్క కేసీఆర్‌కే దక్కుతుందన్నారు.

తమ పార్టీ నేతలను తీసుకోవడాన్ని తప్పుపట్టడం లేదని … కాకపోతే రాజీనామా చేసి తిరిగి టీఆర్‌ఎస్ గుర్తు మీద గెలిపించుకోవాలన్నదే తమ డిమాండ్ అన్నారు. ఈ విషయంలో ఏపీ ప్రతిపక్ష నేత జగన్‌ను చూసి టీఆర్‌ఎస్ నేర్చుకోవాలన్నారు. గతంలో జగన్‌మోహన్‌ రెడ్డి కూడా కాంగ్రెస్‌ నుంచి చాలా మంది ఎమ్మెల్యేలను తీసుకెళ్లారని అయితే వారి చేత రాజీనామా చేయించి తిరిగి గెలిపించుకున్నారని గుర్తు చేశారు. టీఆర్‌ఎస్‌ కూడా అదే పనిచేసి తన సత్తా నిరూపించుకోవాలన్నారు షబ్బీర్‌ అలీ.

తెలంగాణలో పబ్లిసిటీ మినహా ఎక్కడా కూడా పనులు జరగడం లేదన్నారు. హైదరాబాద్ రోడ్లపై ఒక గుంత చూపిస్తే వెయ్యి రూపాయలు ఇస్తానని కేసీఆర్‌ గతంలో ప్రకటించారని … ఇప్పుడు హైదరాబాద్‌లో అసలు రోడ్లే లేకుండా పోయాయన్నారు. డబుల్‌ డెబ్‌ రూమ్‌ ఇళ్లు ఎవరికి కట్టించారో లెక్కలు చెప్పాలన్నారు. కాంగ్రెస్ హయాంలో నిర్మించిన ప్లాంట్ల వల్లే విద్యుత్ కొరత తీరిందన్నారు. 2017నాటికి మణుగూరులో నాలుగు వేల మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసి చూపిస్తామన్న కేసీఆర్‌ ఇప్పటికీ ఆ ప్లాంట్ నిర్మాణానికి కనీసం పర్యావరణ అనుమతులు తీసుకురాలేకపోయారని ఎద్దేవా చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో కోత పెట్టేందుకే ఇంజనీరింగ్ కాలేజీలను మూసివేయిస్తున్నారని ఆరోపించారు. కేజీ టు పీజీ విద్య ఉచితంగా అందిస్తామన్న కేసీఆర్‌ ఇప్పుడు ఆ మాటే మాట్లాడడం లేదని షబ్బీర్‌ అలీ విమర్శించారు.

Click on Image to Read:

jagan-swarupananda-swami

pawan

dk-aruna

gottipati

devineni-uma-jogi-ramesh

brahmin-swis

mla-srikanth-reddy

chandrababu

YSR

First Published:  27 Jun 2016 3:47 AM IST
Next Story