Telugu Global
Cinema & Entertainment

 మంచు ఫ్యామిలీ నుంచి మరో విలన్

వాస్తవానికి మంచు ఫ్యామిలీ ఆరంభం విలన్ పాత్రలతోనే జరిగింది. మంచు మోహన్ బాబు కెరీర్ విలన్ పాత్రలతోనే ప్రారంభమైంది. ఆ తర్వాత హీరోగా, తిరుగులోని కలెక్షన్ కింగ్ గా మారిపోయాడు మోహన్ బాబు. అయితే ఆయన తనయులు మాత్రం నేరుగా హీరోలుగానే ఎంట్రీ ఇచ్చారు. కానీ వాళ్లలో ఒకరు మాత్రం ఇప్పుడు విలన్ పాత్రలపై మనసు పడ్డారు. ఆ ఒక్కడే మంచు విష్ణు. కోలీవుడ్ నుంచి వచ్చిన ఓ ఫ్యాన్ మీకు తమిళంలో చేయడానికి ఇంట్రెస్ట్ ఉందా? […]

 మంచు ఫ్యామిలీ నుంచి మరో విలన్
X
వాస్తవానికి మంచు ఫ్యామిలీ ఆరంభం విలన్ పాత్రలతోనే జరిగింది. మంచు మోహన్ బాబు కెరీర్ విలన్ పాత్రలతోనే ప్రారంభమైంది. ఆ తర్వాత హీరోగా, తిరుగులోని కలెక్షన్ కింగ్ గా మారిపోయాడు మోహన్ బాబు. అయితే ఆయన తనయులు మాత్రం నేరుగా హీరోలుగానే ఎంట్రీ ఇచ్చారు. కానీ వాళ్లలో ఒకరు మాత్రం ఇప్పుడు విలన్ పాత్రలపై మనసు పడ్డారు. ఆ ఒక్కడే మంచు విష్ణు. కోలీవుడ్ నుంచి వచ్చిన ఓ ఫ్యాన్ మీకు తమిళంలో చేయడానికి ఇంట్రెస్ట్ ఉందా? స్టార్ హీరోల సినిమాల్లో విలన్ గా ఛాన్స్ వస్తే చేస్తారా? అని విష్ణును అడగడం జరిగిందట. దానికి పాజిటివ్ గా స్పందించిన విష్ణు.. మేకర్స్ తన దగ్గరకు మంచి స్క్రిప్ట్స్ తో వస్తే తప్పకుండా చేస్తానని చెప్పాడట.
దీంతో ప్రస్తుతం కోలీవుడ్ వర్గాల్లో విష్ణుపై ఇంట్రెస్ట్ పెరిగిందని తెలుస్తోంది. తన తండ్రిలా విష్ణు కూడా విలన్ రోల్స్ లో ఇరగదీస్తాడేమో చూడాలి. తమిళ్ నుంచి తెలుగులోకి వచ్చిన ఆది… ఇక్కడ విలన్ గా పేరుతెచ్చుకున్నాడు. సరైనోడు సక్సెస్ తో ఆదికి మంచి గుర్తింపు వచ్చింది. మరోసారి అలాంటి విలన్ పాత్రలే చేస్తున్నాడు. మరి తెలుగు నుంచి తమిళ్ లోకి వెళ్తున్న విష్ణు కూడా విలన్ గా క్లిక్ అవుతాడేమో చూడాలి. అసలు… వీటన్నింటికంటే ముందు విలన్ పాత్రలు చేయడానికి తండ్రి మోహన్ బాబు ఒప్పుకుంటారా అనేది పెద్ద ప్రశ్న.
First Published:  27 Jun 2016 4:04 AM IST
Next Story