నాగం, రేవంత్‌లు పగటి వేషగాళ్లు: జూపల్లి
బీజేపీ నాయకుడు నాగం జనార్దన్ రెడ్డి, టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిలపై మంత్రి జూపల్లి విరుచుకుపడ్డారు. ఈ ఇద్దరూ పాలమూరులోనే పుట్టి పెరిగినా.. వీరికి సొంత జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తికావడం ఏమాత్రం ఇష్టం లేదని ఆరోపించారు. పాలమూరు ప్రాజెక్టు పూర్తికాకుండా చూడటమే వీరిద్దరి లక్ష్యమని విమర్శించారు. అందుకే వీరిద్దరూ తోడుదొంగల్లా పనులకు అడ్డుపడాలని చూస్తున్నారని మండిపడ్డారు. అమరావతిలో భూసేకరణ పేరుతో రైతుల నుంచి 34 వేల ఎకరాల సాగు భూమిని లాక్కున్నపుడు రేవంత్ ఎక్కడికి వెళ్లాడని ప్రశ్నించారు. […]
BY sarvi27 Jun 2016 3:48 AM IST
X
sarvi Updated On: 27 Jun 2016 6:33 AM IST
బీజేపీ నాయకుడు నాగం జనార్దన్ రెడ్డి, టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిలపై మంత్రి జూపల్లి విరుచుకుపడ్డారు. ఈ ఇద్దరూ పాలమూరులోనే పుట్టి పెరిగినా.. వీరికి సొంత జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తికావడం ఏమాత్రం ఇష్టం లేదని ఆరోపించారు. పాలమూరు ప్రాజెక్టు పూర్తికాకుండా చూడటమే వీరిద్దరి లక్ష్యమని విమర్శించారు. అందుకే వీరిద్దరూ తోడుదొంగల్లా పనులకు అడ్డుపడాలని చూస్తున్నారని మండిపడ్డారు. అమరావతిలో భూసేకరణ పేరుతో రైతుల నుంచి 34 వేల ఎకరాల సాగు భూమిని లాక్కున్నపుడు రేవంత్ ఎక్కడికి వెళ్లాడని ప్రశ్నించారు. ఇక్కడ ఏదో మునిగిపోతున్నట్లు వచ్చి ధర్నాలు, దీక్షలు చేయడం మంచిది కాదని హితవుపలికారు. ఉమ్మడి ఏపీలో బాబు పాలనలో పాలమూరును దత్తత తీసుకున్న విషయం రేవంత్ మరిచిపోయాడని, ఆయన దత్తత తీసుకున్నాక జిల్లా మరింత దిగజారిపోయిందని గుర్తు చేశారు.
ఇకపోతే ఇటీవల నాగం జనార్ధన్ రెడ్డి ప్రాజెక్టుల్లో అవినీతి జరిగిందని కోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. దానిని విచారించిన కోర్టు నాగం వాదనలో పసలేదని తేల్చింది. ఆయన వ్యాజ్యాన్ని కొట్టివేస్తూ తీర్పునివ్వడంతో నాగంకు ఏం చేయాలో పాలుపోలేదు. కొంతకాలం స్తబ్దుగానే ఉన్నాడు. కానీ, మల్లన్నసాగర్ లో నిరసనలు ఎగిసిపడుతున్న వేళ మరోసారి నిద్రలేచాడు. ప్రాజెక్టుల విషయంలో కొట్టివేతకు గురైన తన పిటిషన్‌ను మరోసారి పరిశీలించాలని కోర్టును రెండోసారి ఆశ్రయించాడు నాగం. ఈ పరిణామంతో అధికార పార్టీకి కోపం నశాళానికెక్కింది. వీరు ప్రాజెక్టుల పరిహారం విషయంలో వ్యతిరేకులా? లేకుంటే పూర్తిగా ప్రాజెక్టులకే వ్యతిరేకమా? అని ప్రశ్నించడం మొదలు పెట్టింది. అందుకే, పాలమూరుజిల్లాకే చెందిన అధికార పార్టీ మంత్రి.. జూపల్లి వీరిద్దరి తీరుపై విరుచుకుపడ్డారు. ఇద్దరినీ తోడుదొంగలని అభివర్ణించారు. గత ప్రభుత్వాల హయాంలోనే వీటిని కట్టి ఉంటే.. ఇప్పుడు ఇంత డబ్బు వెచ్చించి నిర్మించాల్సిన అవసరం ఉండేది కాదని గుర్తు చేశారు. నాగం, రేవంత్‌లు.. పగటి వేషగాళ్లలా ప్రవర్తిస్తూ.. అధికారపార్టీపై బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా ఇలాంటివి మానుకోవాలని హితవుపలికారు.
Next Story