పవన్ కల్యాణ్ 200 శాతం ఫెయిల్ అవుతారు...కాపులు సర్వనాశనం అయ్యారు
నిర్మాత చిల్లర కల్యాణ్ తనకున్న రాజకీయ పరిజ్ఞానంతో పవన్ జనసేనపై కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఒక టీవి ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన సి. కల్యాణ్ వచ్చే ఎన్నికల్లో జనసేనకు ఆదరణ ఉండదని చెప్పారు. ఇప్పుడున్న పద్దతిలోనే పవన్ కల్యాణ్ పనిచేస్తే జనసేన 200 శాతం విఫలమవుతుందన్నారు. నాలుగు గోడల మధ్య కూర్చొని అప్పుడప్పుడు ట్విట్టర్‌లో స్పందిస్తే నాయకుడు కాలేరని అన్నారు. పవన్ కల్యాణ్‌కు రాజకీయంగా సినీ ఇండస్ట్రీ మద్దతు ఉండదన్నారు. ఒకవేళ పవన్ కల్యాణ్ […]

నిర్మాత చిల్లర కల్యాణ్ తనకున్న రాజకీయ పరిజ్ఞానంతో పవన్ జనసేనపై కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఒక టీవి ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన సి. కల్యాణ్ వచ్చే ఎన్నికల్లో జనసేనకు ఆదరణ ఉండదని చెప్పారు. ఇప్పుడున్న పద్దతిలోనే పవన్ కల్యాణ్ పనిచేస్తే జనసేన 200 శాతం విఫలమవుతుందన్నారు. నాలుగు గోడల మధ్య కూర్చొని అప్పుడప్పుడు ట్విట్టర్‌లో స్పందిస్తే నాయకుడు కాలేరని అన్నారు. పవన్ కల్యాణ్‌కు రాజకీయంగా సినీ ఇండస్ట్రీ మద్దతు ఉండదన్నారు.
ఒకవేళ పవన్ కల్యాణ్ గెలిస్తే మాత్రం ఇండస్ట్రీ మొత్తం మా పవన్ అంటూ వెంట తిరుగుతుందని సి. కల్యాణ్ చెప్పారు. మెగాఫ్యామిలీకి రాజకీయంగా ఆదరణ లేదన్నారు. చిరు పార్టీ పెట్టడం వల్ల కాపులంతా సర్వనాశనం అయిపోయారన్నారు. చిరు రాకతో అప్పటి వరకు తమకు దక్కని పదవి తమకు వస్తుందని కాపులు భావించారని చెప్పారు. కానీ ఆయన వెంట వెళ్లి చాలా మంది నాయకులు నష్టపోయారన్నారు. కాపులకు ప్రభుత్వం న్యాయం చేస్తుందన్న నమ్మకం లేదన్నారు.
అసలు కాపుల్లోనే ఐక్యత లేదన్నారు సి. కల్యాణ్. కాపుల కోసం దాసరి పార్టీ పెట్టే అవకాశం లేదన్నారు. ఒకవేళ కాపుల కోసం ఆయన ఏదైనా చేయాలనుకుని ఉంటే ఇప్పటికే చేసి ఉండేవారన్నారు. రక్తచరిత్ర చిత్రంలో వైఎస్‌ఆర్‌కు సంబంధించిన సన్నివేశాలను కొన్ని ఒత్తిళ్ల కారణంగా తొలగించాల్సి వచ్చిందన్నారు. చెన్నైలో మూవీ డబ్బింగ్ జరుగుతున్న సమయంలో హీరో సూర్య వెంట వెళ్లిన జగన్ కజిన్స్ కొందరు ఆ సన్నివేశాలు చూశారని చెప్పారు. దాంతో వాటిని తొలగించాల్సిందిగా ఒత్తిడి వచ్చిందని చివరకు వాటిని తీసివేశామన్నారు.
Click on Image to Read: