అఖిల్ "ఎంగేజ్" అయినట్లేనా..?
ఒకే ఒక సినిమాతో బాగా పాపులార్టి సంపాదించుకున్న అఖిల్ ..ప్రస్తుతం తన సెకండ్ మూమీ గురించి ప్రణాళిక చేసుకుంటున్నాడు. పనిలో పనిగా ఒక నాన్ సెలిబ్రిటి కుటుంబానికి చెందిన అమ్మాయితో ప్రేమలో పడ్డాడనే రూమర్ ప్రస్తుతం హాట్ టాపిక్ అయ్యింది. అఖిల్ ఇష్టపడుతున్న అమ్మాయి అక్కినేని ఫ్యామిలీకి చాలా కాలంగా ఫ్యామిలీ ఫ్రెండ్ అని తెలుస్తుంది. మీడియాకు అమ్మాయి గురించి ఏ విషయం అప్పుడే తెలియ కూడదంటున్నాడట అఖిల్. న్యూయార్క్ లో ఫ్యాషన్ డిజైనర్ గా కెరీర్ […]
ఒకే ఒక సినిమాతో బాగా పాపులార్టి సంపాదించుకున్న అఖిల్ ..ప్రస్తుతం తన సెకండ్ మూమీ గురించి ప్రణాళిక చేసుకుంటున్నాడు. పనిలో పనిగా ఒక నాన్ సెలిబ్రిటి కుటుంబానికి చెందిన అమ్మాయితో ప్రేమలో పడ్డాడనే రూమర్ ప్రస్తుతం హాట్ టాపిక్ అయ్యింది. అఖిల్ ఇష్టపడుతున్న అమ్మాయి అక్కినేని ఫ్యామిలీకి చాలా కాలంగా ఫ్యామిలీ ఫ్రెండ్ అని తెలుస్తుంది. మీడియాకు అమ్మాయి గురించి ఏ విషయం అప్పుడే తెలియ కూడదంటున్నాడట అఖిల్.
న్యూయార్క్ లో ఫ్యాషన్ డిజైనర్ గా కెరీర్ కంటిన్యూ చేస్తుందని .. ఉన్నత విద్యా వంతుల కుటుంబానికి చెందిన అమ్మాయిగా చెప్పుకుంటున్నారు. అఖిల్ అమ్మాయికి.. అమ్మాయి అఖిల్ కు చాల కాలంగా తెలుసట. సో ఇదంతా చూస్తుంటే ఎవరో అక్కినేని కుటుంబానికి చెందిన బంధువుల అమ్మాయి అన్నట్లు అనిపిస్తుంది. కానీ రిలేటివ్స్ అమ్మాయి కానే కాదట. అధికారికంగా అఖిల్ అప్పుడే దీనికి సంబంధించి మీడియాకు ఓపెన్ కావడానికి ఇష్టపడటం లేదట. సో నాగార్జున, అమలకు నచ్చితే… బాహుశా అన్నయ్య నాగచైతు కంటే చిన్నవాడైన అఖిలే ముందుగా పెళ్లి పీటలెక్కుతాడా..? ఏమో చెప్పలేం అంటున్నారు పరిశీలకులు.