జానా ఇక టీఆర్ ఎస్ కార్యకర్తగా పనిచేస్తారా?
ఇటీవల టీఆర్ ఎస్‌పై విరుచుకుపడే క్రమంలో జానారెడ్డి కేసీఆర్ కు ఓ సవాలు విసిరారు.. అదేంటంటే.. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తే.. తాను టీఆర్ ఎస్ పార్టీకి ప్రచారకర్తగా పనిచేస్తాను.. అని సవాలు చేశారు. అయితే, ఈ సవాలు విషయం సీఎం కేసీఆర్‌కు తెలుసో..? లేదో..? గానీ..సీఎం కేసీఆర్ మాత్రం ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని పునరుద్ఘాటించారు. విషయమేంటంటే.. ఇటీవల అధికారపార్టీని విమర్శించే క్రమంలో జానారెడ్డి పలు ఆసక్తికర, సంచలన వ్యాఖ్యలు చేశారు. […]
BY sarvi26 Jun 2016 6:31 AM IST
X
sarvi Updated On: 27 Jun 2016 5:29 AM IST
ఇటీవల టీఆర్ ఎస్‌పై విరుచుకుపడే క్రమంలో జానారెడ్డి కేసీఆర్ కు ఓ సవాలు విసిరారు.. అదేంటంటే.. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తే.. తాను టీఆర్ ఎస్ పార్టీకి ప్రచారకర్తగా పనిచేస్తాను.. అని సవాలు చేశారు. అయితే, ఈ సవాలు విషయం సీఎం కేసీఆర్‌కు తెలుసో..? లేదో..? గానీ..సీఎం కేసీఆర్ మాత్రం ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని పునరుద్ఘాటించారు. విషయమేంటంటే.. ఇటీవల అధికారపార్టీని విమర్శించే క్రమంలో జానారెడ్డి పలు ఆసక్తికర, సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారపార్టీ ఆచరణకు వీలుకాని హామీలతో ప్రజలను మభ్య పెడుతోందని విమర్శించారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ అమలు సాధ్యం కాదని స్పష్టం చేశారు. అలా చేసి చూపెడితే.. తాను రాజకీయ సన్యాసం చేస్తానని శపథం చేశారు. తమ హయాంలో ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించడానికే ఎన్నో అవాంతరాలు ఎదుర్కోవాల్సి వచ్చిందని గుర్తు చేసుకున్నారు. నిజంగా కేసీఆర్ ఈ విషయంలో మాట నిలుపుకొంటే.. తాను అధికార పార్టీకి ప్రచారకర్తగా పనిచేసేందుకు సిద్ధమేనన్నారు.
తాజాగా హైదరాబాద్‌లో ముస్లింలకు ఇఫ్తార్ విందులో పాల్గొన్న సీఎం కేసీఆర్ రిజర్వేషన్ల విషయాన్ని ప్రస్తావించారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. ఎవరేమనుకున్నా.. ఈవిషయంలో వెనకడుగు వేసేది లేదని తెలిపారు. ఇప్పటికే దీనిపై వేసిన కమిటీ.. ముస్లింల స్థితిగతులపై అధ్యయనం చేస్తోందని తెలిపారు. దాని నివేదిక రాగానే.. అసెంబ్లీలో బిల్లు పాసు చేసి కేంద్రం వద్దకు పంపుతామని తెలిపారు. ఇప్పుడు సీఎం చెప్పిన సమాధానంతో జానా ఇరుకున పడ్డట్లయింది. ఒకవేళ సీఎం వేసిన కమిటీ నివేదిక ఇచ్చి ముస్లింలకు రాష్ట్రంలో 12 శాతం రిజర్వేష్లన్లు కల్పిస్తే… ఆయన టీఆర్ ఎస్‌కు ప్రచారకర్తగా పనిచేస్తారా? అని గులాబీనేతలు ప్రశ్నిస్తున్నారు. గతేడాది వరంగల్ ఉప ఎన్నిక సందర్భంగా.. కూడా జానారెడ్డి ఇదేమాట చెప్పారని, అప్పట్లోలా ఇప్పుడు మాట తప్పకూడదని గుర్తు చేస్తున్నారు.
Next Story