విపక్షాలపై హరీష్ ఎదురుదాడి!
మల్లన్న సాగర్ భూ నిర్వాసితుల విషయంలో ఇప్పటికే సీఎం కేసీఆర్ స్పష్టమైన ప్రకటన చేయడంతో ప్రతిపక్షాలపై ఎదురుదాడి మొదలైంది. తాజాగా ప్రతిపక్ష నాయకులను ఉద్దేశించి భారీనీటిపారుదల మంత్రి హరీశ్ రావు తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. మల్లన్నసాగర్ భూనిర్వాసితులకు పరిహారం చెల్లించడంలో తమకు ఎలాంటి అభ్యంతరం లేదని మరోసారి స్పష్టంచేశారు. పరిహారం విషయంలో బాధితులను ప్రతిపక్షాలు తప్పదోవ పట్టిస్తున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ, కాంగ్రెస్ డిమాండ్ చేస్తున్నట్లు 2013 భూసేకరణ చట్టం ప్రకారం.. పరిహారం […]
BY sarvi26 Jun 2016 2:00 AM GMT
X
sarvi Updated On: 26 Jun 2016 11:56 PM GMT
మల్లన్న సాగర్ భూ నిర్వాసితుల విషయంలో ఇప్పటికే సీఎం కేసీఆర్ స్పష్టమైన ప్రకటన చేయడంతో ప్రతిపక్షాలపై ఎదురుదాడి మొదలైంది. తాజాగా ప్రతిపక్ష నాయకులను ఉద్దేశించి భారీనీటిపారుదల మంత్రి హరీశ్ రావు తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. మల్లన్నసాగర్ భూనిర్వాసితులకు పరిహారం చెల్లించడంలో తమకు ఎలాంటి అభ్యంతరం లేదని మరోసారి స్పష్టంచేశారు. పరిహారం విషయంలో బాధితులను ప్రతిపక్షాలు తప్పదోవ పట్టిస్తున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ, కాంగ్రెస్ డిమాండ్ చేస్తున్నట్లు 2013 భూసేకరణ చట్టం ప్రకారం.. పరిహారం చెల్లించాల్సి వస్తే.. ఎకరాకు కేవలం రూ.1.80 లక్షలు మాత్రమే చెల్లించాల్సి వస్తుందని తెలిపారు. అదే తాము విడుదల చేసిన జీవో నెంబరు 123 ప్రకారం.. అయితే ఎకరాకు రూ.4.80 లక్షలు చెల్లిస్తామని వివరించారు.
గత ప్రభుత్వాల కంటే తాము మేలైన పరిహారమే ఇస్తున్నామని స్పష్టం చేశారు. ఈవిషయంలో భూ నిర్వాసితులను ప్రతిపక్షాలు తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆరోపించారు. నిజంగా వారు కోరినట్లే 2013 భూ సేకరణ చట్టం ప్రకారం పరిహారమే కావాలని పట్టుబడితే.. అప్పుడు నిర్వాసితులకు అన్యాయం చేసినవారవుతారని విమర్శించారు. నిజంగా రైతులకు సాయం చేయాలన్న ఆలోచన ఉంటే.. మెరుగైన పరిహారం కోసం డిమాండ్ చేయాలి తప్ప.. తక్కువ నష్టపరిహారం డిమాండ్ చేయడం తగదని హితవు పలికారు.
ఒకవేళ ముంపు బాధితులు నష్టపోతే.. దానికి ప్రతిపక్షాలే బాధ్యత వహించాలని ఆయన స్పష్టం చేశారు. మల్లన్న సాగర్ వల్ల కేవలం ఏడు గ్రామాలే ముంపునకు గురవుతున్నాయని అదే.. కాంగ్రెస్ హయాంలో చేపట్టిన ఎల్లంపల్లి ప్రాజెక్టు కింద 11 గ్రామాలు మునిగిపోయాయని తెలిపారు. పులిచింతల పరిధిలో బాధితులకు ఇంకా పరిహారమే అందలేదని ఆయన గుర్తు చేశారు.
Next Story