ఎస్‌ఈ మీద గొట్టిపాటి, బలరాం గేమ్.. అటోఇటో తేలే చాన్స్
అద్దంకి టీడీపీ ఒరలోని రెండు కత్తులు స్థానం కోసం పోరాటం చేస్తున్నాయి. కరణం బలరాం, గొట్టిపాటి రవికుమార్‌లు ప్రతి విషయంలోనూ పట్టింపుకుపోయి పార్టీలో రచ్చరేపుతున్నారు. ఇటీవల బలరాం మనిషిగా ముద్రపడిన అద్దంకి సీఐను గొట్టిపాటి పట్టుబట్టి బదిలీ చేయించారు. విషయం తెలుసుకున్న కరణం బలరాం … చంద్రబాబు, లోకేష్‌తోనే నేరుగా మాట్లాడి అప్పటికప్పుడు సీఐ బదిలీని నిలిపివేయించారు. దీంతో గొట్టిపాటి వర్గం కంగుతింది. ఇప్పుడు ఇద్దరు నేతలు ఇరిగేషన్ ప్రాజెక్టుల ఎస్‌ఈ రమణమూర్తి మీద గేమ్ ఆడుతున్నారు. […]

అద్దంకి టీడీపీ ఒరలోని రెండు కత్తులు స్థానం కోసం పోరాటం చేస్తున్నాయి. కరణం బలరాం, గొట్టిపాటి రవికుమార్‌లు ప్రతి విషయంలోనూ పట్టింపుకుపోయి పార్టీలో రచ్చరేపుతున్నారు. ఇటీవల బలరాం మనిషిగా ముద్రపడిన అద్దంకి సీఐను గొట్టిపాటి పట్టుబట్టి బదిలీ చేయించారు. విషయం తెలుసుకున్న కరణం బలరాం … చంద్రబాబు, లోకేష్‌తోనే నేరుగా మాట్లాడి అప్పటికప్పుడు సీఐ బదిలీని నిలిపివేయించారు. దీంతో గొట్టిపాటి వర్గం కంగుతింది. ఇప్పుడు ఇద్దరు నేతలు ఇరిగేషన్ ప్రాజెక్టుల ఎస్‌ఈ రమణమూర్తి మీద గేమ్ ఆడుతున్నారు.
కరణం బలరాం నీరు చెట్టు పథకం కింద రూ.9 కోట్ల పనులు మంజూరు చేయాలని రమణమూర్తిని కోరారు. ఆయన మాత్రం రూ. 5కోట్ల పనులతో సరిపెట్టారు. దీంతో ఆగ్రహించిన కరణం బలరాం .. మంత్రిపై ఒత్తిడి తెచ్చి ఆయన్ను బదిలీ చేయించారు. ఇదే అదనుగా గొట్టిపాటి రంగంలోకి దిగారు. ఫిరాయించిన జిల్లా ఎమ్మెల్యేలతో పాటు టీడీపీలోని బలరాం వ్యతిరేకవర్గం నేతల సాయంతో ఎస్ఈ బదిలీ వ్యవహారాన్ని సీఎం వరకు తీసుకెళ్లారు. శుక్రవారం గుంటూరులో సీఎంను కలిసి రమణమూర్తి బదిలీ అన్యాయమని… నిబంధనలకు విరుద్దంగా పనిచేయలేనని చెప్పినందుకు బలరాం కక్షకట్టారని వివరించారు. వెంటనే రమణమూర్తి బదిలీ నిలిపివేయాలని కోరారు. దీనిపై మంత్రి దేవినేనిని పిలిపించుకున్న చంద్రబాబు ఎస్ఈ బదిలీ విషయాన్నిఆరా తీశారు.
అంతేకాదు బదిలీ ఆపేయాలని సూచించినట్టు తెలుస్తోంది. ఒకవేళ అదే నిజమై రమణమూర్తి తిరిగి యథాస్థానంలోకి వస్తే తాడోపేడో తేల్చుకోవాలని కరణం బలరాం భావిస్తున్నారు. ఇప్పటికే తనకు మద్దతు తెలిపే నేతలతో సంప్రదింపులు జరిపినట్టు చెబుతున్నారు. ఒకవేళ ఎస్ఈ బదిలీ నిలిచిపోతే మాత్రం అద్దంకి టీడీపీలో గొట్టిపాటి ఉంటారా లేక బలరాం మిగులుతారా అన్నది తేలిపోతుందంటున్నారు.
Click on Image to Read: