ముద్దు వివాదంలో సిద్ధరామయ్య!
నిత్యం ఆయన వివాదాల్లో ఉంటారో.. లేక వివాదాలే ఆయనతో సావాసం చేస్తాయో తెలియదు గానీ కర్ణాటక సీఎం సిద్ధరామయ్య నిత్యం ఏదో వివాదంలో నిలుస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఆయన తన ప్రమేయం లేకుండానే.. జాతీయ స్థాయిలో పాపులర్ అయిపోయారు. తాజాగా సీఎం సిద్ధరామయ్యను ఓ మహిళ బహిరంగంగా ముద్దుపెట్టుకుంది. ఈ వీడియో ఇప్పుడు మీడియాలో వైరల్ గా మారింది. ఆదివారం బెంగళూరులో కురబ (తెలుగు రాష్ర్టాల్లో కురమ) సామాజికవర్గానికి చెందిన బహిరంగ సభ జరిగింది. సీఎం సిద్ధరామయ్య […]
BY sarvi26 Jun 2016 9:32 AM IST
X
sarvi Updated On: 27 Jun 2016 5:22 AM IST
నిత్యం ఆయన వివాదాల్లో ఉంటారో.. లేక వివాదాలే ఆయనతో సావాసం చేస్తాయో తెలియదు గానీ కర్ణాటక సీఎం సిద్ధరామయ్య నిత్యం ఏదో వివాదంలో నిలుస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఆయన తన ప్రమేయం లేకుండానే.. జాతీయ స్థాయిలో పాపులర్ అయిపోయారు. తాజాగా సీఎం సిద్ధరామయ్యను ఓ మహిళ బహిరంగంగా ముద్దుపెట్టుకుంది. ఈ వీడియో ఇప్పుడు మీడియాలో వైరల్ గా మారింది. ఆదివారం బెంగళూరులో కురబ (తెలుగు రాష్ర్టాల్లో కురమ) సామాజికవర్గానికి చెందిన బహిరంగ సభ జరిగింది. సీఎం సిద్ధరామయ్య కూడా ఇదే కులానికి చెందిన వాడు కావడంతో ఆయన కూడా హాజరయ్యారు. ఈ క్రమంలో ఆయన పలువుర్ని వేదికపై సన్మానిస్తున్నారు. చిక్‌మగ్‌లూరు జిల్లా తారికెర్ పంచాయతీ సభ్యురాలైన గిరిజా శ్రీనివాస్ ను సైతం సిద్ధరామయ్య సన్మానించారు. సన్మానం అవగానే ఆమె సీఎంకు దగ్గరగా జరిగి ఫొటోలకు ఫోజులిచ్చింది. ఇక వెళ్లేముందు ఆయనకు మరింత దగ్గరగా జరిగి కుడిబుగ్గపై ముద్దుపెట్టి అక్కడ నుంచి వెళ్లిపోయింది. జరిగిన పరిణామంతో ఆయన కొంచెం ఇబ్బంది పడ్డారు.
ఈ పరిణామం అనంతరం గిరిజ మీడియాతో మాట్లాడారు. సిద్ధరామయ్య తనకు తండ్రి లాంటి వారని, ఇందులో వివాదానికి తావులేదని స్పష్టం చేశారు. తనకు ఇప్పటికే పెళ్లి అయిందని, సిద్ధరామయ్య మా నియోజకవర్గం వారే అని వివరణ ఇచ్చింది. మొత్తానికి సిద్ధరామయ్య వివాదాలకు ఎంతదూరం ఉందామనుకుంటున్నా.. అవి మాత్రం ఆయనను వెదుక్కుంటూ వస్తున్నాయి.
నిత్యం ఇదే తంతు!
ఈనెల రెండోవారంలో ఆయన కారుపై ఓ కాకి వాలింది. దీంతో అపశకునమని భావించిన సిద్ధు ఆ కారును మార్చేశారని పెద్దెత్తున విమర్శలు రేగాయి. అంతేనా.. రూ.35 లక్షలుపెట్టి అప్పటికప్పడు మరో కొత్త కారు కూడా కోనేశారని గగ్గోలు పెట్టారు. మార్చిలో ఆయన చేతికి అత్యంత ఖరీదైన వాచీ ఉండటంపై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. దాదాపు రూ.70 లక్షల విలువైన వాచీ ఆయనకు ఎక్కడిది? అని అసెంబ్లీలో ప్రతిపక్షాలు నిలదీశాయి. అది తనకు మధ్యప్రాచ్యానికి చెందిన ఓ వైద్యమిత్రుడు కానుకగా ఇచ్చాడని, దాన్ని తాను కొనలేదని ప్రతిపక్షాలకు సమాధానం ఇచ్చినా.. వారు సంతృప్తి చెందలేదు. అలాగే కారు విషయంలోనూ కాకి వల్ల కారును మార్చలేదని అప్పటికే అది రెండు లక్షల కిలోమీటర్లు తిరిగినందున మార్చామని వివరణ ఇచ్చారు. వివాదం జాతీయ స్థాయిలో తీవ్ర చర్చకు దారితీయడంతో ఆయన సోనియాకు వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.
Next Story