తెలుగుతెరపైకి మరో నటవారసుడు
మెగా కాంపౌండ్ నుంచి ఇప్పటికే దాదాపు మగాళ్లంతా హీరోలుగా మారిపోయారు. మిగిలిన వాళ్లంతా ఇంకా మైనారిటీ స్టేజ్ లోనే ఉన్నారు. అటు నందమూరి కాంపౌండ్ నుంచి కూడా మోక్షజ్ఞ… ఎప్పుడెప్పుడు ముఖానికి రంగేసుకుందామా అని వెయిటింగ్. అక్కినేని ఫ్యామిలీ నుంచి ఇప్పటికే అంతా హీరోలైపోయారు. అక్కడ ఎవరూ మిగల్లేదు. ఇక మిగిలింది ఒక్క దగ్గుబాటి కుటుంబం మాత్రమే. ఇప్పుడు ఆ కుటుంబం నుంచి మిగిలిన ఒకే ఒక్క మనిషి తెరపైకి వచ్చేస్తున్నాడు. సురేష్ బాబు రెండో కొడుకు, […]
BY sarvi26 Jun 2016 2:53 AM IST
X
sarvi Updated On: 27 Jun 2016 5:06 AM IST
మెగా కాంపౌండ్ నుంచి ఇప్పటికే దాదాపు మగాళ్లంతా హీరోలుగా మారిపోయారు. మిగిలిన వాళ్లంతా ఇంకా మైనారిటీ స్టేజ్ లోనే ఉన్నారు. అటు నందమూరి కాంపౌండ్ నుంచి కూడా మోక్షజ్ఞ… ఎప్పుడెప్పుడు ముఖానికి రంగేసుకుందామా అని వెయిటింగ్. అక్కినేని ఫ్యామిలీ నుంచి ఇప్పటికే అంతా హీరోలైపోయారు. అక్కడ ఎవరూ మిగల్లేదు. ఇక మిగిలింది ఒక్క దగ్గుబాటి కుటుంబం మాత్రమే. ఇప్పుడు ఆ కుటుంబం నుంచి మిగిలిన ఒకే ఒక్క మనిషి తెరపైకి వచ్చేస్తున్నాడు. సురేష్ బాబు రెండో కొడుకు, రానా తమ్ముడు, రామానాయుడు మనవడు అభిరామ్ హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. ఈ మధ్య ఓ ఆంగ్ల పత్రికతో ముచ్చటించిన అభిరామ్ ప్రేమకథలు, కుటుంబ కథా సినిమాల్లో నటించాలనుకుంటున్నాను అని చెప్పాడు. అందుకు తగ్గ కథల అన్వేషణ జరుగుతుందని చెప్పిన అభి……. మాస్ కమ్యునికేషన్స్‌లో డిగ్రీ పూర్తి చేశాడు.. సత్యానంద్ వద్ద వైజాగ్‌లో 6 నెలల పాటు శిక్షణ తీసుకున్నారు. తాతగారి చివరి రోజుల్లో ఆయనకి సహాయకుడిగా ఉంటూ సినిమా నిర్మాణం పట్ల మక్కువ పెంచుకున్న అభిరామ్…. బాబాయ్ వెంకటేష్, అన్న రానా వల్లనే నటుడిగా మారాలని ఫిక్స్ అయ్యాడట. అయితే నిర్మాతగానూ కొనసాగాలని అనుకుంటున్నాడట.
Next Story