ఎమ్మెల్యే అరెస్టు ఇంత దారుణంగానా?
ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వంపై పోలీసులు ఇంకా కర్కశంగానే వ్యవహరిస్తున్నారు. దేశంలో పలు చోట్ల ఎమ్మెల్యేలు మర్డర్లు, మానభంగాలకు పాల్పడుతున్నా.. అరెస్టు చేయడానికి వెనకాముందు ఆలోచించే పోలీసులు.. ఢిల్లీలో మాత్రం చెలరేగిపోతున్నారు. కళ్లముందు ఉన్న ఎమ్మెల్యేని అరెస్టు పేరుతో ఈడ్చుకెళుతున్నారు. శాసనసభ్యుడు అన్న కనీసం గౌరవం లేకుండా పెడరెక్కలు విడిచి తీసుకెళుతున్నారు. ఇంతకీ విషయ మేంటంటే.. కేంద్ర సర్కారు ఆదేశాల మేరకు నడుచుకునే ఢిల్లీ పోలీసులు మరోసారి ఆప్ ఎమ్మెల్యేపై పడ్డారు. ఓ మహిళ ఫిర్యాదు చేసిందన్న కారణంతో […]
BY sarvi26 Jun 2016 12:20 AM GMT
X
sarvi Updated On: 27 Jun 2016 12:05 AM GMT
ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వంపై పోలీసులు ఇంకా కర్కశంగానే వ్యవహరిస్తున్నారు. దేశంలో పలు చోట్ల ఎమ్మెల్యేలు మర్డర్లు, మానభంగాలకు పాల్పడుతున్నా.. అరెస్టు చేయడానికి వెనకాముందు ఆలోచించే పోలీసులు.. ఢిల్లీలో మాత్రం చెలరేగిపోతున్నారు. కళ్లముందు ఉన్న ఎమ్మెల్యేని అరెస్టు పేరుతో ఈడ్చుకెళుతున్నారు. శాసనసభ్యుడు అన్న కనీసం గౌరవం లేకుండా పెడరెక్కలు విడిచి తీసుకెళుతున్నారు. ఇంతకీ విషయ మేంటంటే.. కేంద్ర సర్కారు ఆదేశాల మేరకు నడుచుకునే ఢిల్లీ పోలీసులు మరోసారి ఆప్ ఎమ్మెల్యేపై పడ్డారు. ఓ మహిళ ఫిర్యాదు చేసిందన్న కారణంతో ఆప్ ఎమ్మెల్యే దినేశ్‌ని అరెస్టు చేశారు. ఆసమయంలో ఆయన మీడియా సమావేశంలో ఉన్నారు. శాసన సభ్యుడు అన్న కనీస మర్యాద లేకుండా ఆయన్ను రెండు చేతులు పట్టుకుని మీడియా ప్రతినిధులు చూస్తుండగానే.. లాక్కెళ్లారు. ఆయన మాటలు పట్టించుకోకుండా నేరస్థుడిలా చూస్తూ.. జీపులోకి తీసుకెళ్లారు. ఆప్ ప్రభుత్వం గద్దెనెక్కాక ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసిన ఎమ్మెల్యేల సంఖ్య తాజాగా ఎనిమిదికి చేరింది.
ఏం జరిగింది?
ఢిల్లీ జల్ బోర్డు చైర్మన్‌గా ఉన్న ఆప్ ఎమ్మెల్యే దినేశ్ మెహానియా వద్దకు ఈనెల 23న కొందరు మహిళలు వెళ్లారు. నీటి సరఫరా విషయంలో ఎమ్మెల్యేతో గొడవపడ్డారు. కోపం వచ్చిన ఎమ్మెల్యే వాళ్లతో గట్టిగా మాట్లాడారు. దాంతో ఎమ్మెల్యే తమతో అసభ్యంగా ప్రవర్తించి, తమపై చేయిచేసుకుని బెదరించారని లైంగిక వేధింపులకు పాల్పడ్డారని పలు రకాల సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులోనే పోలీసులు ఆయన్ను పోలీసులు కనీస మర్యాద పాటించకుండా అరెస్టు చేశారు. ఈవిషయంపై కేజ్రీవాల్ తీవ్రంగా స్పందించారు. మోదీ ప్రభుత్వం ఢిల్లీలో ఎమర్జెన్సీ నాటి రోజులను తలపింపజేస్తోందని ఆరోపించారు. ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైన ఎమ్మెల్యేలను పోలీసులతో అరెస్టు చేయించడం సరికాదని హితవు పలికారు. ఇటీవల జరిగిన ఎన్ ఎండీసీ ఎస్టేట్ ఆఫీసర్ ఖాన్ హత్య కేసును పక్కదారి పట్టించేందుకే దినేశ్‌ని అరెస్టు చేశారని ఆప్ ఆరోపిస్తోంది.
Next Story