Telugu Global
National

గూడు చెదిరిన శ‌రణార్ధుల సంఖ్య ఆరున్న‌ర కోట్లు

ప్ర‌పంచంలో గూడు చెదిరిన శ‌ర‌ణార్థుల సంఖ్య గ‌త సంవ‌త్స‌రం ఆరున్న‌ర కోట్ల‌కు చేరుకుంద‌ని ఐక్య‌రాజ్య‌స‌మితి ఇటీవ‌ల వెల్ల‌డించింది.దీని ఫలితంగా రెండో ప్ర‌పంచ యుద్ధం త‌రువాత శ‌ర‌ణార్థుల సంక్షోభాన్ని యూర‌ప్ పెద్ద ఎత్తున ఎదుర్కొంటున్న‌ది.పాల‌స్తీనియ‌న్లు, సిరియ‌న్లు, ఆఫ్ట‌న్‌లు అంత‌ర్జాతీయ శ‌ర‌ణార్థుల్లో ఎక్కువ సంఖ్య‌లో ఉన్నారని స‌మితి శ‌ర‌ణార్థుల  సంస్థ అధిప‌తి పిలిపో గ్రాండి వెల్ల‌డించారు. శ‌ర‌ణార్థులకు స‌హాయం అందించే దేశాల మాన‌వ‌తా దీక్ష ప‌రీక్ష‌కు గుర‌వుతున్న‌ద‌ని ఆయ‌న పేర్కొన్నారు. ప్ర‌పంచ  జ‌నాభా 734 కోట్లు కాగా అందులో ఒక […]

గూడు చెదిరిన శ‌రణార్ధుల సంఖ్య ఆరున్న‌ర కోట్లు
X

ప్ర‌పంచంలో గూడు చెదిరిన శ‌ర‌ణార్థుల సంఖ్య గ‌త సంవ‌త్స‌రం ఆరున్న‌ర కోట్ల‌కు చేరుకుంద‌ని ఐక్య‌రాజ్య‌స‌మితి ఇటీవ‌ల వెల్ల‌డించింది.దీని ఫలితంగా రెండో ప్ర‌పంచ యుద్ధం త‌రువాత శ‌ర‌ణార్థుల సంక్షోభాన్ని యూర‌ప్ పెద్ద ఎత్తున ఎదుర్కొంటున్న‌ది.పాల‌స్తీనియ‌న్లు, సిరియ‌న్లు, ఆఫ్ట‌న్‌లు అంత‌ర్జాతీయ శ‌ర‌ణార్థుల్లో ఎక్కువ సంఖ్య‌లో ఉన్నారని స‌మితి శ‌ర‌ణార్థుల సంస్థ అధిప‌తి పిలిపో గ్రాండి వెల్ల‌డించారు. శ‌ర‌ణార్థులకు స‌హాయం అందించే దేశాల మాన‌వ‌తా దీక్ష ప‌రీక్ష‌కు గుర‌వుతున్న‌ద‌ని ఆయ‌న పేర్కొన్నారు. ప్ర‌పంచ జ‌నాభా 734 కోట్లు కాగా అందులో ఒక శాతం మంది గూడు చెదిరి అనేక స‌మ‌స్య‌లు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా సిరియా అంతర్‌యుద్ధంలో ఈ స‌మ‌స్య మ‌రింత జ‌ఠిల‌మైంది. ఆరున్న‌ర కోట్ల మంది శ‌ర‌ణార్థుల్లో 4 కోట్ల మంది స్వ‌దేశంలోనే ఇత‌ర స్థ‌లాల్లో త‌ల‌దాచు కోగా 2.13 కోట్ల‌మంది ఇత‌ర దేశాల‌కు త‌ర‌లి పోయారు.

First Published:  25 Jun 2016 1:20 AM IST
Next Story