అలా మీదపడి కరవడం సరికాదు
ఏపీ రాజధాని సెంటిమెంట్‌ను చంద్రబాబు తన దోపిడి కోసం వాడుకుంటున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య ఆరోపించారు. ప్రతిపక్షాలను కనీసం సంప్రదించకుండా చంద్రబాబు ముందుకెళ్లడం మంచిది కాదన్నారు. రాచరికంలోనూ ఇంత దారుణంగా పరిస్థితి ఉండదన్నారు. స్విస్ చాలెంజ్ విధానాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు చెప్పారు. ప్రజారాజధాని అంటూనే తనకు నచ్చిన వారికి భూములు కట్టబెడుతున్నారని విమర్శించారు. వీటిపై ప్రశ్నించిన మీడియా ప్రతినిధులపై చంద్రబాబు మీదపడి కరుస్తున్నారని రామచంద్రయ్య మండిపడ్డారు. సీఎం స్థాయి వ్యక్తి ఇలా మీద పడి […]
ఏపీ రాజధాని సెంటిమెంట్‌ను చంద్రబాబు తన దోపిడి కోసం వాడుకుంటున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య ఆరోపించారు. ప్రతిపక్షాలను కనీసం సంప్రదించకుండా చంద్రబాబు ముందుకెళ్లడం మంచిది కాదన్నారు. రాచరికంలోనూ ఇంత దారుణంగా పరిస్థితి ఉండదన్నారు. స్విస్ చాలెంజ్ విధానాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు చెప్పారు.
ప్రజారాజధాని అంటూనే తనకు నచ్చిన వారికి భూములు కట్టబెడుతున్నారని విమర్శించారు. వీటిపై ప్రశ్నించిన మీడియా ప్రతినిధులపై చంద్రబాబు మీదపడి కరుస్తున్నారని రామచంద్రయ్య మండిపడ్డారు. సీఎం స్థాయి వ్యక్తి ఇలా మీద పడి కరవడం సరికాదన్నారు. మీడియాను సైతం నియంత్రించాలని చంద్రబాబు చూస్తున్నారని… ఏదో ఒక రోజు ప్రజలు కూడా చంద్రబాబును, ఆయన పార్టీని నిషేదిస్తారని రామచంద్రయ్య హెచ్చరించారు. మొన్నటి ఎన్నికల్లో అధికారపక్షానికి ప్రతిపక్షానికి ఒక్క శాతం ఓట్లు మాత్రమే తేడా ఉన్న విషయాన్ని చంద్రబాబు గుర్తించుకోవాలన్నారు.
ప్రపంచంలోనే అత్యంత అభ్యంతరకరమైన స్విస్‌చాలెంజ్ విధానాన్ని ఎందుకు అనుసరిస్తున్నారని ప్రశ్నించారు. రాజధాని నిర్మాణానికి గ్లోబల్ టెండర్లు పిలవాలని డిమాండ్ చేశారు. గతంలో నిజాం షుగర్ ఫ్యాక్టరీని కూడా స్విస్ చాలెంజ్‌లో అమ్మేశారని ఆయన గుర్తు చేశారు. ప్రపంచంలో తానే తెలివైన వాడినన్న భ్రమల్లో చంద్రబాబు ఉంటూ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని రామచంద్రయ్య మండిపడ్డారు. వెంటనే రాజధాని నిర్మాణంపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
Click on Image to Read: